టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లలో ఒకరైన అనుష్క ప్రస్తుతం కోటి రూపాయిల పారితోషికాన్ని తీసుకుంటుంది. అయితే సినీ కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత సంపాదించిందో అనుష్క స్వయంగా చెప్పింది. నేను స్టార్ హీరోయిన్ కావచ్చు. కానీ సంపాదన విషయంలో నేను చాలా పూర్ అని అంటోంది అనుష్క.
CLICKHERE : బట్టతల సమస్యకు చెక్ పెట్టాలంటే....
అదేమిటని అడిగితే....నేను పది రూపాయిలు సంపాదిస్తే ఆ పది రూపాయిలు ఖర్చు పెట్టేస్తాను. సంపాదించే దానిలో ఎంతో కొంత దాచుకోవాలని తెలియదు. అంతేకాక నాకు చాలా పెద్ద సర్కిల్ ఉంది. ప్రతి రోజు ఎవరికో ఒకరికి గిఫ్ట్స్ కొంటూ ఉంటానని, అలాగే నా బ్యాంక్ బేలన్స్ తో చాలా సంతోషంగా ఉన్నానని అంటోంది అనుష్క.
CLICKHERE : సుహాసిని మణిరత్నం గురించి మనకు తెలియని విషయాలు
తన సిబ్బందికి ప్లాట్స్ కొనిపెట్టిందట. అనుష్క మేకప్ మెన్ కి సైతం ఒక ఇల్లు కట్టి ఇచ్చిందట. అందుకే అనుష్క గురించి అందరు అంత గొప్పగా చెపుతూ ఉంటారు.