శబరిమల గురించి ఆసక్తికరమైన విషయాలు

ఒకప్పుడు శబరిమల యాత్ర అంటే భయం భయంగా వెళ్లేవారు. ఎప్పుడు ఏ చోట ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవరికీ తెలిసేది కాదు. కాని ఇప్పుడు ఇజీగా వెళ్లి వస్తున్నారు. అప్పట్లో శబరిమల వెళ్ళటానికి ఒకేఒక్క దారి ఉండేది, దాని పేరు ఎరుమేలిమార్గం. ఈ దారిలోనే పూజారులు, సిబ్బంది ఆలయానికి గుంపులు గుంపులుగా, బృందంగా వెళ్లేవారట. 

శబరిమల అడవీ ప్రాంతం అవ్వడం వలన అప్పటి నుంచి ఇప్పటి వరకు బృందాలుగా వెళ్ళటం ఆనవాయితీగా వస్తుంది. శబరిమల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం…

స్వామియే … శరణమయ్యప్ప ! అంటూ మొదలు పెడదాం…
1907 లో శబరిమల గర్భగుడి పైకప్పు ఎండుగడ్డి తో, ఆకులతో కప్పబడివుండేది. అప్పట్లో గర్భగుడిలో ఏకశిలా విగ్రహానికి పూజలు చేసేవారు.

1909 లో దేవాలయంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
రెండువందల సంవత్సరాల క్రితం 70 మంది శబరిమల యాత్ర కు వెళ్లారని, ఆ సంవత్సర ఆదాయం 7 రూపాయలని రికార్డ్ లలో పేర్కొనబడింది.


దేవాలయాన్ని మరలా 1909-10 వ సంవత్సరంలో పునఃనిర్మించారని తెలుస్తుంది.
1909-10 వ సంవత్సరంలో శిలా విగ్రహానికి బదులు, పంచలోహాలతో తయారుచేసిన అయ్యప్ప విగ్రహాన్ని ప్రతిష్టించారు. అప్పటి నుండి పంచలోహ విగ్రహానికె పూజలు చేస్తుండటం గమనార్హం.

CLICKHERE : బట్టతల సమస్యకు చెక్ పెట్టాలంటే....

1935 తర్వాత భక్తుల సంఖ్య గణనీయంగా పెరగటంతో మకరజ్యోతి దర్శనానికే కాకూండా మండల పూజ కొరకు కూడా భక్తులను లోనికి ఆహ్వానించారు.
చాలక్కాయమార్గం, వడిపెరియారు మార్గం ఏర్పడటంతో శబరిమల యాత్రకు వచ్చే వారి సంఖ్య మరింత పెరిగింది.
1945 వ సంవత్సరంలో ఆలయ బోర్డు, కేవలం మకరజ్యోతి సమయంలోనే కాక విషు, పంకుని ఉత్తారం, ఓనం వంటి పండుగల సమయాలలో కూడా ఆలయ ద్వారాలు తెరిచి ఉంచేటట్లు తీర్మానించింది.
CLICKHERE: సుహాసిని మణిరత్నం గురించి మనకు తెలియని విషయాలు

1950 వరకు పరుశురామ నిర్మితమైన దేవాలయం మూడు సార్లు అగ్నికి ఆహుతైంది.

1951 లో పంచలోహ విగ్రహాన్ని చెంగనూరు నుండి తెప్పించి వేదపండితుల మంత్రోచ్చారణ ల మధ్య ప్రతిష్టించారు. అప్పటి వరకు కేరళీ కేళీవిగ్రహంగా కిర్తించబడ్డ అయ్యప్ప స్వామి భారతీకాళీ విగ్రహంగా, నేడు భూతళీకేళీ విగ్రహం గా కీర్తించబడుతున్నది.
CLICKHERE : బిర్యానీ ఆకును ఇంటిలో కాల్చితే....ఏమవుతుందో తెలుసా?

1984 కు పూర్వం పదునెట్టాంబడి ఎక్కటానికి భక్తులు పరుశురామ నిర్మితమైన రాతిమెట్లనే వాడేవారు. మెట్లను ఎక్కేటప్పుడు ప్రతి మెట్లుపై కొబ్బరికాయ ను కొట్టేవారు. దాంతో భక్తులు మెట్లు ఎక్కటానికి ఇబ్బంది పడేవారు. ఇది దృష్టిలో పెట్టుకొని బోర్డు వారు 1985 లో పదునెట్టాంబడికి పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పేశారు.

2000 వ సంవత్సరంలో బెంగళూరు భక్తుడొకాయన గర్భగుడి పైన, దాని చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయటానికి పూనుకోవడటంతో శబరిమల స్వర్ణ దేవాలయంగా మారిపోయింది.
స్వామి వారి ఆభరణాలను పందళం లో భద్రపరిచి ఉంచుతారు.
ప్రతి ఏటా మకరసంక్రాంతి తారీఖున మూడు పెట్టలలో భద్రపరిచిన ఆ ఆభరణాలను 11 మంది మూడురోజుల పాటు మోసుకుంటూ వచ్చి 84 కిలోమీటర్ల దూరంలో ఉన్న శబరిమల చేరవేస్తారు.
CLICKHERE : ఇది చ‌దివాక అర‌టి పండు తొక్క‌ను పారేయ‌రు..!

తెచ్చిన ఆభరణాలను స్వామి వారికి అలంకరించి, కర్పూరహారతి గుళ్లో ఇవ్వగానే తూర్పుదిక్కు పొన్నంబలమేడు నుండి భక్తులకు మకరజ్యోతి దర్శనం కానవస్తుంది.

ఆభరణాల వెంట పందళం రాజ వంశస్థులలో ఒకరు(పెద్దవాడు) కత్తి పట్టుకుంటూ నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరిగి జనవరి 20 వ తేదీన ఆభరణాలను వెంట పందళం వరకు వెళ్లి వాటిని చేరవేరుస్తాడు.

CLICKHERE : యుంగ్ టైగర్ 'సింహాద్రి' గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

CLICKHERE : 15 నిమిషాల్లో ఒంటి నొప్పులు తగ్గాలంటే ఏమి చేయాలి?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top