భయపెడుతున్న అందాల భామలు ఎవరో తెలుసా?

హీరోయిన్లు అంటే అందాలు ఆరబోస్తే సరిపోదని, హర్రర్ మూవీస్ తో కూడా భయపెట్టాలని ఈ నాటి హీరోయిన్లు అనుకుంటున్నారా? లేకపోతే వెండితెరపై అందాలు ఒలకబోసే అందగత్తెలు ప్రస్తుతం భయంకరమైన హావభావాలతో ప్రేక్షకులను ఎందుకు భయపెడుతున్నారు. కథానాయికలు అంటే.. కేవలం యుగళగీతాలకు మాత్రమే పరిమితం కాదని, గుండె ఝల్లుమనేలా భయాన్ని పుట్టించడానికి సిద్ధ పడాలని ఎందుకు అంటున్నారు. ఎందుకంటే నటనతో ఆకట్టుకోవాలంటే ఇలా చేస్తేనే పదికాలాలపాటు ప్రేక్షకుల మదిలో ఉంటామని అంటున్నారు.

CLICKHERE : క‌ళ్ళ కొన‌ల వ‌ద్ద పుసి ఎందుకు వ‌స్తుందో తెలుసా..?

అందుకే ఓ వైపు హీరోలతో ఆడిపాడుతూనే.. మరోవైపు తమ ప్రత్యేకతను చాటుకొనేలా ఇలాంటి సినిమాలపై దృష్టి పెడుతున్నారు. ఇక హర్రర్ మూవీస్ లో కూడా తామే రాజు, రాణిలా నటిస్తూ... ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్నారు. ఈ కోవలో త్రిష, నయనతార, అనుష్కలతో పాటు పలువురు హీరోయిన్లు ఉండటం గమనార్హం. అరుంధతి నుంచి తాజాగా నాయకి వరకు అందరూ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇంకా ఇలాంటి వివరాల్లోకి వెళ్తే...


CLICKHERE : ఈ నియమాలను..... పాటిస్తే పొట్ట మాయం

అనుష్క
ఈమె ప్రధాన పాత్రలో నటించిన అరుంధతి ఆమెకు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత అదే తరహాలో పలు సినిమాల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ.. ఆచితూచి అడుగులు వేస్తోంది. తర్వాత పంచాక్షరి, రుద్రమదేవి వంటి సవాలుతో కూడుకున్న సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం బాగమతి అనే థ్రిల్లర్ కథలో చేస్తోంది.

CLICKHERE : జీర్ణ శక్తి పెంచుకోవడానికి కొన్ని అద్భుతమైన చిట్కాలు


త్రిష
ఇక చిత్ర పరిశ్రమకు పరిచయమై దాదాపు 16 ఏళ్లు దాటుతున్నా ఇంకా తన హవా తగ్గలేదంటున్న త్రిష తెలుగు, తమిళం, కన్నడ చిత్రాల్లో నటించి మెప్పించిన ఆమె తమిళంలో సత్తా చాటుతూనే వుంది. అరణ్మనై 2 సినిమాతో మురిపించిన ఈమె తాజాగా నాయకితో కొన్నివర్గాల ప్రేక్షకులను బెంబేలెత్తించింది. ఇక మరో హర్రర్ సినిమాకు ఆమె సంసిద్ధమవుతోంది. రమణ మాదేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో త్రిష కీలక పాత్ర పోషిస్తోంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ లండన్ లో జరిగింది. ఇక ఈ సినిమా కోసం త్రిష కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
CLICKHERE : భోజనం చేసిన వెంటనే నీళ్ళు తాగితే ఇక అంతే

నయన తార
శరత్ కుమార్ హీరోగా నటించిన అయ్యా సినిమా ద్వారా కోలీవుడ్ లోకి అడుగుపెట్టిన మలయాళ ముద్దుగుమ్మ నయనతార. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని హవా కొనసాగిస్తోంది. ఆరంభంలోనే చంద్రముఖి వంటి హర్రర్ కథాంశంతో కూడుకున్న సినిమాలో నటించిన ఈ సుందరాంగి ఇటీవల మాయలో అందరినీ భయపెట్టేసింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. తాజాగా మరో హర్రర్ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. ఓ వైపు సాధారణ సినిమాల్లో నటిస్తూనే.. ఇలా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చే సినిమాలపై కూడా దృష్టి సారిస్తోంది. దర్శకుడు సర్గుణం నిర్మాణంలో దాస్ రామస్వామి దర్శకత్వంలో డోర అనే చిత్రంలో నయనతార కీలకపాత్ర ఆమెదే. ఇందులో ఆమె పాత్రను సస్పెన్స్ గా ఉంచారు. మాయలో మాదిరిగానే ఇందులో కూడా నటించినట్లు టాక్.
CLICKHERE : ఇడ్లీ మెత్తగా,మృదువుగా రావాలంటే.....

మెరుపు తీగ హన్సిక
ము(బొ)ద్దుగుమ్మగా టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న హన్సిక.. కోలీవుడ్ కు వచ్చేసరికి నాజూగ్గా తయారైంది. ధనుష్, శింబు, విశాల్ వంటి పలువురు హీరోల సరసన ఆడిపాడిన ఈమె మూడేళ్లుగా తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకుంది. ఇక ఈ మెరుపు తీగ, ఆ మధ్య సుందర్.సి దర్శకత్వంలోని అరణ్మనై సినిమాలో నటించి మెప్పించింది. దెయ్యంగా పగ తీర్చుకునే సన్నివేశాల్లో మంచి హావభావాలు చూపింది. ప్రస్తుతం జయంరవి సరసన బోగన్ సినిమాలో నటించిన ఈమె, మరో హర్రర్ సినిమాకు సంతకాలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది.
CLICKHERE : మన శరీరంలోని అవయవాలు అదిరితే...ఏమి జరుగుతుందో తెలుసా?

CLICKHERE : కారం లో కల్తీని తెలుసుకోవడం ఎలా?

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top