మనుషులందరూ ఒకలా వుండరు. అలాగే మగాళ్లకు ఆడాళ్లకు ఒకేరకమైన ఇబ్బందులు సమస్యలు రావు. అయితే ఇది మరిచిపోతే, రకరకాల సందేహాలు వస్తాయి. అందులో ముఖ్యంగా ప్రస్తుత కాలంలో సగటు పురుషుడ్ని వేధిస్తున్న సమస్య బట్టతల. అయినా ఇది మాకే ఎందుకొస్తుంది.. ఆడవాళ్లకు ఎందుకు రాదు?
CLICKHERE : రామాయణం తర్వాత రాముడు ఎలా చనిపోయాడో తెలుసా
CLICKHERE : బొడ్డు తాడు భద్రపరచడం వలన కలిగే ఉపయోగాలు
CLICKHERE : సమయానికి ఆహారం తీసుకోకపోతే....అది తగ్గుతుందట!
CLICKHERE : కూర్చొన్న చోటే క్యాలరీలను ఖర్చు చేసే బెస్ట్ టిప్స్…
అని చాలామంది పురుషులు లోలోపల మధనపడుతుంటారు కూడా. దానికి కారణం పురుషుల్లో లైంగికతను ప్రేరేపించే టెస్టోస్టిరాన్ హార్మోన్ నుంచి డీహైడ్రోటెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి కావడమే. ఇది వెంట్రుకల పెరుగుదలను నియంత్రిస్తుంది.
స్త్రీలతో పోలిస్తే పురుషుల వెంట్రుకల పొడవు తక్కువగా ఉండడానికి కారణం కూడా ఇదే. చాలాసార్లు ఇది వంశపారంపర్యంగా వస్తుంది. ఈ హార్మోన్ ఎక్కువగా విడుదలయ్యే వారిలో వెంట్రుకల పెరుగుదల తక్కువగా ఉండటమే కాక ఉన్నవి కూడా ఊడిపోతాయి. స్త్రీలలో ఈ హార్మోన్ చాలా తక్కువగా ఉంటుంది అందుకే వాళ్లకు చాలా అరుదుగా మాత్రమే బట్టతల వస్తుంటుందని అంటున్నారు.