అమ్మ సినిమాల నుండి సీఎం వరకు లైఫ్ సీక్రెట్స్

దక్షిణాది రాజకీయాల్లో ఆమెది చెరగని ముద్ర. రాజకీయా ల్లో ఒక మహిళ అసాధారణ స్థాయికి చేరి అత్యంత శక్తివంతంగా మారి దేశ రాజకీయాలపై కూడా ప్రభావము చూపే స్థాయికి ఎదిగారంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎలాంటి వెన్ను దన్ను లేకుండా తాను అనుకున్న సిద్ధాంతాలను నమ్మి దానికి కట్టుబడి ముక్కుసూటిగా వెళ్లి ఎంతో మంది మెప్పు పొందిన ధీర వనిత జయలలిత.

CLICKHERE : కోట్లకు పడగెత్తిన యాంకర్స్ ఎవరో తెలుసా?

అమ్మ అని, పురచ్చి తలైవి అని తమిళ ప్రజలు ఆరాధించే జయలలిత జీవితం వడ్డించిన విస్తరి ఏ మాత్రం కాదు. ఒక సాధారణ పేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చిన్న వయస్సులోనే అత్యంత ఖరీదైన జీవితాన్ని అనుభవించి అంతలోనే అవినీతిలో కూరుకుపోయి...మళ్ళీ పైకి లేచి నిలదొక్కుకున్న జయలలిత జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి.

CLICKHERE : మల్లె టీ త్రాగితే....జరిగే అద్భుతం తెలిస్తే...షాక్


జయలలిత ఫిబ్రవరి 24, 1948న అప్పటి మైసూరు రాష్ట్రంలోని పాండవపుర తాలూకా, మేలుకోటేలో జయరాం, వేదవల్లి దంపతులకు జన్మించింది. జయలలిత అసలు పేరు కోమలవల్లి. అది ఆమె అవ్వగారి పేరు. బ్రాహ్మణ సంప్రదాయాన్ని అనుసరించి ఆమెకు రెండు పేర్లు పెట్టారు. జయలలిత అనే రెండో పేరును పాఠశాలలో చేర్చేటపుడు నమోదు చేశారు. జయలలిత తండ్రి మైసూర్ సంస్థానంలో సర్జన్ గా పనిచేసేవారు.

CLICKHERE : హార్ట్ అటాక్ వచ్చే ముందు కనబడే కొన్ని లక్షణాలు

జయలలితకు జయకుమార్ అనే అన్నయ్య ఉన్నాడు. ఏ మాత్రం కుటుంబ భాద్యతలను పట్టించుకోని తండ్రి జయలలిత రెండేళ్ల వయస్సులోనే కాలం చేసారు. దాంతో కుటుంబ బాధ్యతలన్నీ ఆమె తల్లి వేదవల్లి చూసుకుంది. ఆ రోజుల్లోనే జయ తల్లి జయను మెట్రిక్యులేషన్ వరకు చదివించారు.

CLICKHERE : మీరు వాడే సౌందర్య లేపనాలలో కొన్నింటిని ఎలా తయారు చేస్తారో తెలిస్తే మీరు అవి అస్సలు వాడరు ఇంతకీ అవేంటో తెలుసా……
జయ మెరిట్ స్టూడెంట్ కావటంతో పై చదువులకు కేంద్రం నుండి స్కాలర్ షిప్ వచ్చినా...ఆలోపే ఆమె దృష్టి సినిమాల వైపుకు మళ్లింది. కుటుంబ భారంతో జయ తల్లి బెంగుళూర్ నుంచి మద్రాస్ కి మకాం మార్చింది. జయ తల్లి తన పేరును సంధ్యగా మార్చుకొని సినిమాల్లో నటించారు. ఆ తర్వాత జయలలిత భరతనాట్యం నేర్చుకొని సినిమాల వైపుకు వెళ్ళింది. 1960 లోనే డాన్స్ అరంగ్రేటం చేసింది జయలలిత.

CLICKHERE : ప్రతి రోజు ఉదయాన్నే ఉప్పు నీటిని త్రాగితే....ఎన్ని లాభాలో...

జయలలిత తల్లితో పాటు షూటింగ్స్ కి వెళ్ళేది. ఒక షూటింగ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ రాకపోవటంతో జయలలితకు అవకాశం వచ్చింది. 1961 లో శ్రీశైల మహత్యం అనే కన్నడ సినిమాలో పార్వతిగా తొలిసారి వెండితెరపై బాలనటిగా కనిపించారు. జయలలిత తొలి సినిమా చిన్నడ గొంబె కన్నడ సినిమా. ఈ సినిమాకు ఆమె 3000 రూపాయిల పారితోషికం. తొలి తెలుగు సినిమా మనుషులు మమతలు ఈమెను పెద్దతార స్థాయికి తీసుకెళ్లింది.

CLICKHERE : అప్పుడే పుట్టిన పిల్లల్ని ఫోటో తీస్తున్నారా?? అయితే ఒకసారి ఇది చదవండి...
జయలలిత స్కర్ట్స్,బికినీల సంస్కృతీని తెరపైకి పరిచయం చేసింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. ఈ క్రమంలో ఆమె MGR తో కలిసి 28 సినిమాలు చేయటంతో ఆయనతో సాన్నిహిత్యం పెరిగింది. అప్పట్లో MGR కి వయస్సు 45 పైనే ఉంటే జయలలితకు 16 ఏళ్ళు. అయితే జయలలిత MGR ని గురువుగా భావించింది. తన కెరీర్ లో 125 సినిమాలను చేసిన జయకు 119 బాక్స్ ఆఫీస్ హిట్స్ ఉన్నాయి. 1980 లో వచ్చిన నాయకుడు వినాయకుడు జయలలిత ఆఖరి సినిమా.

CLICKHERE : ఆడవాళ్ళకు బట్టతల ఎందుకు రాదో తెలుసా?
ఇక రాజకీయాల విషయానికి వస్తే M.G.రామచంద్రన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే జయలలిత రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1984 నుంచి 1989 వరకు తమిళనాడు నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఎంజీఆర్ మరణం తరువాత అతని వారసురాలిగా ప్రకటించుకున్నది. జానకి రామచంద్రన్ తరువాత ఆమె తమిళనాడు రాష్ట్రానికి ఎన్నికైన రెండో మహిళా ముఖ్యమంత్రి.

CLICKHERE : భయపెడుతున్న అందాల భామలు ఎవరో తెలుసా?

సెప్టెంబరు 27, 2014 న జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయింది. దాంతో ఆమె తన ముఖ్యమంత్రి పదవి రద్దైనది. పదవిలో ఉండగా కేసులో ఇరుక్కుని పదవీచ్యుతురాలైన మొదటి ముఖ్యమంత్రి అయింది. మే 11, 2015న కర్ణాటక ఉన్నత న్యాయస్థానము ఆమెను నిర్దోషిగా విడిచిపెట్టింది. దాంతో ఆమె మే 23న తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టింది.
CLICKHERE : క‌ళ్ళ కొన‌ల వ‌ద్ద పుసి ఎందుకు వ‌స్తుందో తెలుసా..?

CLICKHERE : ఈ నియమాలను..... పాటిస్తే పొట్ట మాయం

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top