రేడియో మిర్చి ఇది చాలా హాట్ గురూ అంటూ రేడియో జాకీ గా పనిచేసిన ప్రదీప్ 2010 సంవత్సరానికి గాను ఉత్తమ యాంకర్ గా ప్రతిష్టాత్మక నంది అవార్డును సొంతం చేసుకున్నాడు. హైదరాబాద్ కు చెందిన ప్రదీప్ విజ్ఞాన్ ఇన్స్తిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఈఈఈ ఇంజినీరింగ్ పూర్తి చేసాడు.
CLICKHERE : యవ్వనంగా ఉండాలంటే....తీసుకోవలసిన ఆహారం
CLICKHERE : శీతాకాలంలో వచ్చే దగ్గు,జలుబు తగ్గటానికి సులభమైన చిట్కాలు
CLICKHERE :పిల్లల్లో ఏడుపు మన్పించాలంటే ఏమి చేయాలి?
అయితే ప్రదీప్ మొదటగా తన కెరీర్ ని ఒక ఈవెంట్ ప్రమోటర్ గా ప్రారంభించాడు. ఆ తరువాత రేడియో జాకీగా చేసి, ప్రదీప్ తరువాత బుల్లితెరకి పరిచయమయ్యాడు. అయితే ‘ప్రదీప్ దర్బర్’ అనే కామెడీ షోతో తన హవా మొదలెట్టాడు.
CLICKHERE : మహేష్ ఇంటిని చూస్తే షాక్ అవుతారు
జీ తెలుగులో వచ్చే ‘గడసరి అత్త సొగసరి కోడలు’ అనే ప్రోగ్రామ్ తో ఒక్కసారిగా పాపులర్ ఐన ప్రదీప్ ఆ దెబ్బతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆ షో తెచ్చిపెట్టిన క్రేజ్ ప్రదీప్ కి ఒక్కసారిగా తన రెమ్యూనరేషన్ పెంచేలా చేసింది. ఆ తరువాత జీ తెలుగులోనే వచ్చే ‘కొంచం టచ్లో ఉంటే చెప్తా’ అనే ప్రోగ్రామ్ తో సెలెబ్రెటీలనిఇంటర్వ్యూ చేసి, వారి వ్యక్తిగత,సినిమా జీవితాల గురించి ప్రేక్షకులకి తెలియజేశాడు.
CLICKHERE : మహేష్ ఇంటిని చూస్తే షాక్ అవుతారు
ఈ షో వాళ్ళ ఆ ఛానల్ రేటు కూడా అమాంతం పెరిగింది. ఇవే కాకుండా ఈ-టీవిలో వచ్చే నర్తనశాల,అదుర్స్, ఈ-ప్లస్ లో వచ్చే కిరాక్ షో, లక్ష్మి దేవి తలుపు తట్టింది, జీ తెలుగులో ‘నేనే నెం.1’,బిగ్ కెల్లంగే షో, ఒకరికి ఒకరు, మా టీవిలో వచ్చే ‘దమ్ము’ వంటి వాటిలో చేస్తున్నాడు. సినిమాలో కూడా ప్రదీప్ తన మార్క్ చూపించాడు. అత్తారింటికి దారేది, 100% లవ్, మనోరమ, జులాయి, వరుడు వంటి సినిమాలలో నటించాడు.
CLICKHERE : అందమైన పెదాలు సొంతం....కావాలంటే...???
తన మాటలతో ప్రేక్షకులని, కిక్కెక్కించే ప్రదీప్ అంటే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ వుంది. అయితే ఇన్ని షోలతో బిజీగా వున్న ప్రదీప్ తన తొలి సంపాదన రూ.25,000 వేలతో ఈవెంట్ ఆర్గనైజర్ గా మొదలెట్టాడు. అయితే ప్రస్తుతం తన సంపాదన నెలకి 20లక్షలు వస్తుంది.
CLICKHERE : ప్రదీప్ గురించి తెలియని షాకింగ్ నిజాలు
రేడియో జాకీగా పనిచేసే సమయంలో 20వేలు తీసుకున్న ప్రదీప్, తన బుల్లితెరలో తన తొలి షోకి రూ.15,000 తీసుకున్నాడు. అయితే ప్రస్తుతం అతను చేసే ఒకో ఎపిసోడ్ కి రూ.50,000 తీసుకుంటాడు. కొంచం టచ్లో ఉంటే చెప్తా అనే షోకి ఏకంగా లక్ష తీసుకుంటున్నట్లు తేలింది.
CLICKHERE : అందమైన పెదాలు సొంతం....కావాలంటే...???
CLICKHERE : ప్రదీప్ గురించి తెలియని షాకింగ్ నిజాలు
అయితే ప్రస్తుతం ఫిమేల్ యాంకర్ల హవా నడుస్తున్న తరుణంలో వచ్చి మేల్ యాంకర్ గా నిలదొక్కుకొని, ఇప్పుడు తన హవా కొనసాగిస్తున్నాడు. ఇవే కాకుండా ఆడియో ఫంక్షనలో కూడా తన హవా కొనసాగిస్తున్నాడు.