రూ.2,000 నోట్లు ఎక్కడ ప్రింట్ అయ్యాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

మన దేశంలోని నల్లధనాన్ని రూపుమాపడానికి ప్రధాని నరేంద్ర మోడీ రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ స్థానంలో కొత్తగా రూ. 2,000, రూ.500 నోట్లు చెల్లుబాటులోకి తీసుకువచ్చారు. ఆయితే కొత్తగా చెల్లుబాటులోకి తీసుకువచ్చిన రూ.2,000, రూ.500 నోట్లు ఎక్కడ ముద్రించారు,వాటిని ఇంత రహస్యంగా ఎలా ఉంచారు, ఆ నోట్లను దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకులకు ఎలా తరలించారు ? అని చాల మంది ఆలోచిస్తున్నారు. 


అందుకు సమాధానం కావాలంటే ఇక్కడ ఉంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దేశంలో చాల ముద్రణా కేంద్రాలు ఉన్నాయి. అయితే ప్రధాని మెడీ అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అదే కర్ణాటకలో రూ.2,000, రూ.500 నోట్లు ముద్రించాలని మెడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాచనగరిలోని మైసూరులో రూ.2,000, రూ.500 నోట్లు ముద్రించాలని ఆదేశాలు జారీ చేశారు. అంతే మైసూరు నగరంలోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణా లిమిటెడ్ లో కొత్త నోట్లు ముద్రించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. గత ఆరు నెలల నుంచి కసరత్తలు చేసి రూ. 2,000, రూ.500 నోట్లు ముద్రించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉన్న ఈ రిజర్వ్ బ్యాంక్ ముద్రణా కేంద్రంలో గత ఆరు నెలల నుంచి కొత్త నోట్లు ముద్రించారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణా లిమిటెడ్ కు చాల ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ప్రెస్ కు ప్రత్యేకమైన రైల్వే లైన్లు ఉన్నాయి. హై టెక్నాలజీ పేపర్ అందుబాటులో ఉంది.

పత్రేక్యమైన వాటర్ పైప్ లైన్లు ఉన్నాయి. అంతే ఇక్కడ కొత్త నోట్లు ప్రింట్ చెయ్యడానికి అన్ని సిద్దం చేశారు. గత ఆరు నెలల నుంచి పనులు మొదలు పెట్టారు. దక్షిణ మైసూరుకు 10 కిలోమీటర్ల దూరంలోని మందకహళ్ళి ఎయిర్ పోర్టుకు చాల కాలం నుంచి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఎయిర్ పోర్టులో ఒకేఒక్క రన్ వే ఉంది. గత వారం రోజులుగా ఈ మాందకహళ్ళి ఎయిర్ పోర్టు నుంచి వరసగా విమానాల రాకపోకలు కొనసాగాయి. స్థానిక ప్రజలు ఇంత కాలం తరువాత ఎందుకు విమానాలు వరుసగా ఇక్కడికి వచ్చి వెలుతున్నాయి అని అలోచించారు.

ఇక్కడే కొత్త నోట్లు ముద్రించారు అని మాత్రం వారు ఊహించలేపోయారు. గత వారం రోజుల నుంచి రూ.2,000, రూ.500 కొత్త నోట్లను వరుసగా ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి తరలించారు. అక్కడి నుంచి రిజర్వు బ్యాంక్ ద్వారా దేశంలోని వివిధ బ్యాంకులకు తరలించారు. భారతదేశంలో మొదటి సారి రూ.1,000 నోట్లు చెల్లుబాటులోకి వచ్చిన సమయంలో ఇదే ప్రింట్టింగ్ ప్రెస్ లో వెయ్యి రూపాయల నోట్లు ముంద్రించారు.

రూ. 2,000, రూ.500 కొత్త నోట్లు ముద్రించడానికి కేంద్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు ద్వారా బెంగళూరులోని ఓ ఎస్ బీఐ బ్రాంచ్ కు ఒక లక్ష యూరోలు (రూ.73,42,000 ) చెల్లించిందని వెలుగు చూసింది. దేశంలో కొత్తగా అమలులోకి వచ్చిన రూ.2,000, రూ.500 కొత్త నోట్లు మైసూరులో ముద్రించారని తెలుసుకున్న స్థానిక ప్రజలతో పాటు కర్ణాటక ప్రజలు ఆశ్చర్యానికి గురైనారు. మొత్తం మీద మోడీ గుట్టుచప్పుడు కాకుండా ఈ నిర్ణయం తీసుకుని అనుకున్నది అనుకున్నట్లుగానే అమలులోకి తెచ్చారు.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top