అఖిల్ పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా?

మైనింగ్ మాఫియా కింగ్‌.. గాలి జ‌నార్ద‌న్ రెడ్డి కూతురు వివాహం వార్త‌లతో మీడియా షేక్ అవుతోంది. ఒక్క‌గానొక్క కూతురు వివాహానికి ఆయ‌న చేస్తున్న హ‌డావిడి అంతా ఇంతా కాదు. అయితే, ఇదే లెవ‌ల్‌లో వీల‌యితే అంత‌కంటే ఎక్కువ ఖ‌ర్చుతో వివాహానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతోంద‌ట అక్కినేని అఖిల్‌ కాబోయే అత్తా మామ‌గారు. ఆ హంగామా చూస్తుంటే.. గాలి వారి వివాహం తేలిపోనుంద‌నే వార్తలు వినిపిస్తున్నాయి.


అక్కినేని ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ అయింది. వ‌చ్చే నెల 9న హైద‌రాబాద్‌లోని జీవీకే హౌస్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే నిశ్చితార్ధ‌పు ఇన్విటేష‌న్ కార్డ్‌లు కూడా వ‌చ్చాయి. ఎంగేజ్‌మెంట్ సంగ‌తి ఎలా ఉన్నా.. పెళ్లి మాత్రం గ్రాండ్‌గా చెయ్యాల‌ని భావిస్తోంది అక్కినేని కుటుంబం. అయితే, ఇట‌లీలోని రోమ్‌లో ఈ పెళ్లి చేసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిని డెస్టినేష‌న్ మ్యారేజ్ అంటార‌ని.. ఫారిన్‌లో ఈ త‌ర‌హా మ్యారేజ్‌లు స‌హ‌జ‌మ‌ని, ఇండియాలో అఖిల్ వివాహంతో ఈ సంప్ర‌దాయం మొద‌ల‌వుతుంద‌ని ప‌లువురు భావిస్తున్నారు.

దీని సంగ‌తి ప‌క్క‌న‌పెడితే… ఇట‌లీలో అంటే ఖ‌ర్చు ఓ రేంజ్‌లో ఉంటుంది. ఖ‌ర్చు త‌డిసి మోపెడ‌వుతుంది. ఫ్ల‌యిట్ చార్జీలు, అక్క‌డి హోటల్‌లు, అతిథుల‌కు ఆహ్వానంతోపాటు విందు, వినోదాల‌కు భారీగానే వ్యయం కానుంది. అయితే, ఈ భార‌మంతా అఖిల్ కాబోయే మామ‌గారే భ‌రించ‌నున్నార‌ని స‌మాచారం. అఖిల్ కాబోయే భార్య ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త జీవీకే మ‌న‌వ‌రాలు అని, వారికి వేల కోట్ల‌లో ఆస్తులున్నాయ‌ని, ఇట‌లీలోని ఓ హోట‌ల్‌తో వారికి కాంట్రాక్ట్స్ ఉన్నాయ‌ని అందుకే, అక్క‌డే మ్యారేజ్‌కి సిద్ధ‌మవుతున్న‌ట్లు స‌మాచారం.

అయితే, ఇదంతా గాసిప్స్ అని.. పెళ్లి కూడా ప‌క్కా హిందూ సంప్ర‌దాయ ప‌ద్ధ‌తుల‌లో ఇక్క‌డే జ‌ర‌గ‌నుంద‌ని అక్కినేని ఫ్యామిలీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అఖిల్ ఎంగేజ్‌మెంట్ ఇన్విటేష‌న్ కార్డ్ చాలా సింపుల్‌గా ఉంద‌ని, మ్యారేజ్ కూడా అంతే సింపుల్‌గా జ‌రుగుతుంద‌ని అంటున్నారు. మ‌రి, ఏది నిజ‌మో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వెయిట్ చెయ్య‌క‌త‌ప్ప‌దు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top