శివ బాలాజీ భార్య ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

శివ బాలాజీ భార్య - నటి మధుమిత గురించి కొన్ని వివరాలు

లవ్‌ కమ్‌ అరేంజ్డ్‌....
మాది లవ్‌ కమ్‌ అరేంజ్డ్‌ మ్యారేజ్‌. నేను తమిళంలో దాదాపు పదిహేను చిత్రాల్లో కథానాయికగా నటించాను. శివబాలాజీతో కలిసి తమిళంలో ఓ చిత్రం చేశాను. అప్పుడే తనతో క్లోజయ్యాను. ఆ తర్వాత అప్పుడప్పుడూ మాట్లాడుకునేవాళ్లం. అలా స్నేహం ప్రేమగా మారింది. ఇంట్లో పెద్దలు ఒప్పుకున్నారు. అలా మాది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహమైంది.



CLICKHERE : సోంపు వాటర్ ని ఇలా తాగితే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది..

మాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్దబ్బాయి పేరు ధన్విన్‌. చిన్నోడిపేరు గగన్‌. రెండో కాన్పులో పాప పుట్టాలని కోరుకున్నా. అయితే మళ్లీ అబ్బాయే పుట్టాడు. మావారు శివబాలాజీ సినిమాలతో బిజీగా ఉంటారు. నేను కూడా బిజీగా మారిపోతే ఎలా..? ఆర్థికంగా ఎదగాలి అనుకున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేయడంలో తప్పులేదు. డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. పిల్లల బాల్యాన్ని బేబీకేర్‌ సెంటర్స్‌కు అంకితం చేయకుండా.. అమ్మగా నా బాధ్యతను నిర్వర్తించాలని అనుకున్నా. నా పిల్లల బాల్యం నా సంరక్షణలోనే గడవాలని కోరుకున్నా. 

CLICKHERE : ఒకప్పటి టాప్ హీరోయిన్స్ ఇప్పుడు ఏమి చేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు

అందుకే కెరీర్‌కి కూడా కామా పెట్టేశా. మా చిన్నబ్బాయి రెండున్నరేళ్లు వచ్చాక నేను కెరీర్‌పై దృష్టిసారిస్తాను. పిల్లాడు అంబాడటం, అడుగులు వేయడం.. అమ్మా అని పిలవడం.. అన్నీ దగ్గరుండి చూసి, విని అమ్మదనాన్ని ఆస్వాదిస్తున్నాను. ఎప్పటికీ గుర్తుండిపోయే మధురక్షణాలివి. ఉద్యోగాలు చేస్తున్న భార్యాభర్తలు వారి పిల్లల్ని బేబీకేర్‌ సెంటర్స్‌లో ఉంచుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇది తప్పనను. కాకపోతే.. ఇలాంటి సందర్భాల్లో కనీసం కుటుంబ సభ్యుల సంరక్షణ అయినా ఉండేలా చూసుకుంటే మేలు.

CLICKHERE : సొంత ప్రాంతాలను కాదని భాగ్యనగరమే ముద్దు అంటున్న హీరోయిన్లు..ఎందుకలా..!!

షాట్‌ గ్యాప్‌లో...
కెరీర్‌, పిల్లలు బ్యాలెన్స్‌ చేసుకోవాలంటే ఫ్యామిలీ సపోర్ట్‌ ఉండాలి. పుట్టింటివారు, అత్తింటివారు.. ఇలా వీరిలో ఎవరో ఒకరు పిల్లల్ని చూసుకోవాలి. ‘భలే భలే మగాడివోయ్‌’ చిత్రం షూటింగ్‌ సమయంలో మా అత్తమ్మ నాతో వచ్చింది. మా రెండో అబ్బాయికి అప్పుడు నాలుగు నెలలు. కార్వాన్‌లో అత్తమ్మ బాబును చూసుకునేది. షాట్‌ గ్యాప్‌లో నేను మా పిల్లాడి దగ్గరికి వెళ్లిపోయేదాన్ని. ఇక పెద్దోడిని ఇంటి దగ్గర మా అమ్మ చూసుకునేది. వీరి సపోర్ట్‌తోనే పిల్లల పోషణ నాకు మరింత సులువైంది.

CLICKHERE : ఆల్కహాల్ లో ఇది కలిపి చెవిలో కొన్ని చుక్కలు వేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా..

అందరిలాగే...
అమ్మయ్యాక అందరిలాగే సహనం పెరిగింది. నా ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఎంత మారినా.. పిల్లల అభిరుచులను మాత్రం కనిపెట్టలేకపోతున్నా. మా పెద్దోడు ఆరు నెలలు ఉన్నప్పటి నుంచే ఐపాడ్‌తో దోస్తీ చేశాడు. వాళ్ల నాన్న అలవాటు చేశాడు. వాడికేదో చెప్పాలని ఐపాడ్‌లో వీడియో ఆన్‌ చేసి ఇచ్చేవాడు. బాబుకి అదే అలవాటైంది. ఈ అలవాటును మాన్పించడానికి నేను కష్టపడ్డాను. 

CLICKHERE : రామాయణం నిజామా లేక వాల్మీకి ఊహాగానమా? తిరుగిలేని సాక్షాలు ఇవే…

పిల్లాడిని సాయంత్రాలు పార్క్‌కి తీసుకెళ్లడం, ఆడించడం, సైక్లింగ్‌ చేయించడం ఇలా వేరే వ్యాపకాలతో వాడిని బిజీ చేశాక.. ఐపాడ్‌ అలవాటు తగ్గింది. ఇప్పుడైతే రోజుకో అరగంటో, గంటో ఫోన్‌తో కాలక్షేపం చేస్తాడు. గేమ్స్‌ భలే ఆడతాడు. నా కన్నా, మా వారి కన్నా వాడే ఫాస్ట్‌గా ఆడతాడు. మాకు షార్ట్‌కట్స్‌ కూడా చెబుతుంటాడు. పెద్డాడ్ని చూసి.. చిన్నోడికి ఐపాడ్‌ ఇవ్వకూడదని అనుకున్నాం. 

CLICKHERE : చిరు షో ని 'హిట్' చేస్తాడా 'ప్లాప్' చేస్తాడా ....టాక్ ఏమిటో తెలిస్తే షాక్

అల్లరే అల్లరి...
పిల్లల క్రమశిక్షణ అనేది తల్లి బాధ్యత. ఈ తరం తండ్రులు పిల్లలతో చాలా క్లోజ్‌గా ఉంటున్నారు. చాలా గారాబం కూడా చేస్తున్నారు. మావారు అంతే. ఆయన పిల్లలతో కలిస్తే అల్లరే అల్లరి. అందుకే ఆయన మాట అంతగా వినరు. నేను రంగంలోకి దిగితే గానీ.. అల్లరి తగ్గదు. అలాగని పిల్లలను కొట్టడం, బెదిరించడం అంటూ ఏమీ ఉండదు. వారి కళ్లలోకి చూస్తూ.. ఇలా చేయొద్దు అని నాలుగు మంచి మాటలు చెబుతానంతే. సెట్‌ అయిపోతారు. ఈ పద్ధతి ఇప్పటికైతే మంచి ఫలితాలే ఇస్తోంది.

CLICKHERE : అనసూయ- రష్మిలకు చెక్? మరో హీరోయిన్ ఎంట్రీ...???

నూటికి నూరు మార్కులు...
చదువు అనగానే మార్కులే కొలమానం అనుకుంటారు. నూటికి నూరు మార్కులు రావాలని చిన్నప్పటి నుంచే వారిపై ఒత్తిడి ఉంటోంది. ఈ పద్ధతికి నేను, మావారు బద్ధ వ్యతిరేకులం. చదువనేది నాలెడ్జ్‌ కోసమనేది మా భావన. బట్టీకొట్టి చదవడం వల్ల పిల్లల్లో క్రియేటివిటీ తగ్గిపోతుంది. ఇండిపెండెంట్‌గా ఆలోచించగలగాలి. తమ ఆలోచనలను ఆచరణలో పెట్టగలిగే నైపుణ్యం ఉండాలి. తల్లిదండ్రులుగా వారికి అన్ని రకాలైన అవకాశాలు కల్పిస్తాం. ఎలా ఎదుగుతారన్నది వారిష్టం. అమ్మగా.. మా పిల్లలు బాధ్యత తెలిసిన పౌరులు అవుతారని నమ్ముతున్నా.

నాకు కోపం ఎక్కువ...
మా పెద్దబ్బాయి స్కూల్లో న్యాప్‌కిన్‌ను ఉతికిస్తారు. ఎందుకంటే ఎవరిపని వారే చేసుకోవటం నేర్పించాలనేది ఆ స్కూల్‌ తత్వం.
చిన్నప్పటి నుంచి నాకు కోపం ఎక్కువ. కోపం వస్తే బాగా అరిచేదాన్ని. చిన్నపుడు ఒకడు మా అక్కను ఏడిపిస్తే వాళ్లింటికి వెళ్లి కొట్టేసి వచ్చాను. అమ్మయ్యాక కోపం తగ్గిపోయింది. కూల్‌గా ఉంటున్నా.
మా ఆయన షూటింగ్‌ నుంచి వచ్చాక పిల్లలతో బాగా ఆడుకుంటాడు. వంటగదిలోకెళ్లి తనొక్కడే వంట కూడా చేస్తాడు. నాన్‌వెజ్‌ బాగా చేస్తాడు. ఆయన ద్వారా నాన్‌వెజ్‌ వండటం నేర్చుకున్నా.

block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top