చైతు కొత్త బైక్ రేటెంతో తెలుసా?

చాలామంది సెలబ్రిటీలకు ఖరీదైన కార్లు.. బైకులపై విపరీతమైన మోజు ఉంటుంది. మార్కెట్లోకి వచ్చిన కొత్త మోడల్స్ విషయంలో అప్డేటెడ్ గా ఉండే స్టార్లు.. నచ్చిన మోడల్ కనిపించిందంటే వెంటనే సొంతం చేసేసుకుంటూ ఉంటారు. ఎంత ఖరీదైనా సరే.. ఏ మాత్రం ఆలోచించరు.

 

CLICKHERE : యూరిన్ ఏ రంగులో ఉంటే ఎటువంటి అనారోగ్యమో తెలుసా?!
బైక్ లవర్ గా అక్కినేని నాగ చైతన్య మంచి గుర్తింపు ఉంది. బైక్స్ విషయంలో ఈ హీరో టేస్ట్.. చాలామంది సెలబ్రిటీలకు కూడా నచ్చుతుంది. తాజాగా చైతు ఓ సూపర్ బైక్ సొంతం చేసుకున్నాడు. సూపర్ బైక్ కేటగిరీలోని ఎంవీ అగస్టాను కొనుగోలు చేశాడు చైతు. దీని ఖరీదెంతో తెలుసా.. జస్ట్ 27 లక్షల రూపాయలు అంతే. ఈ సూపర్ బైక్ ను రీసెంట్ గా కొనుగోలు చేసిన చైతు.. దీని రిజిస్ట్రేషన్ కోసం హైద్రాబాద్ లోని కొండాపూర్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చాడు.

CLICKHERE :ఈ 10 మంది భామలు హీరోల్ని వదిలేసి డైరెక్టర్ల్ని పెళ్లి చేసుకున్నారు

ఈ బైక్ రిజిస్ట్రేషన్ కోసం.. చైతు చెల్లించిన లైఫ్ టైం రోడ్ ట్యాక్స్ 4.5 లక్షల రూపాయలు. చైతు కొత్త వెహికల్ కు టీఎస్07ఎఫ్ఎం 2003 నెంబర్ ను కేటాయించినట్లు కొండాపూర్ ఆర్టీఏ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఇలాంటి ఖరీదైన బైక్స్ కు ఫ్యాన్సీ నెంబర్ కోసం ప్రయత్నిస్తారు. కానీ.. చైతు మాత్రం సాధారణ నెంబర్ తోనే సరిపెట్టేయడం విశేషమే.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top