రద్దయిన రూ.500, రూ.1000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు మరో అవకాశం ఇవ్వాలని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. అయితే, డిపాజిట్‌ను రూ.2 వేలకే పరిమితం చేయనుంది. ప్రభుత్వ, బ్యాంకు వర్గాల సమాచారం ప్రకారం.. ప్రభుత్వం నిర్దేశించిన డిసెంబరు 30 గడువు ముగిసిన తర్వాత కూడా కొంతమంది ఇళ్లలో కొన్ని రద్దయిన నోట్లు బయటపడ్డాయి.
CLICKHERE : యూరిన్ ఏ రంగులో ఉంటే ఎటువంటి అనారోగ్యమో తెలుసా?!
ఓ వ్యక్తి పుస్తకంలో ఇటీవల వెయ్యి నోటు బయటపడింది. మరో వ్యక్తి బట్టల్లో రూ.500 నోటు కనబడింది. ఇలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని రూ.2 వేల వరకు బ్యాంకుల్లో జమ చేసే అవకాశం కల్పించాలని ప్రభుత్వం, ఆర్బీఐ భావిస్తున్నాయి. ఈ అవకాశానికి కూడా అతి తక్కువ కాల పరిమితి విధించాలనుకుంటున్నాయి.
CLICKHERE : హీరోయిన్స్ వారి కూతుళ్లు ఎలా ఉంటారో ఒక లుక్ వేద్దామా