కమెడియన్ స్నిగ్ధ గురించి ఎవరికీ తెలియని నిజాలు

'అలా మొదలైంది' సినిమా చూసినవాళ్లెవ్వరూ అందులో టామ్ బాయ్ పాత్ర పోషించిన స్నిగ్ధను మరిచిపోలేరు. చూడ్డానికి అబ్బాయిలా కనిపించే స్నిగ్ధ.. తెరమీద కూడా అలాంటి పాత్రలే చేస్తూ ఉంటుంది. తాజాగా 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' సినిమా టీజర్లో స్నిగ్ధ ఎలా మెరుపులు మెరిపించిందో అందరూ చూశారు. ఈ సినిమా ఆమెకు మరో టర్నింగ్ పాయింట్ అయ్యేలా ఉంది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు అమ్మాయిలతో సూటవ్వదని స్నిగ్ధ వ్యాఖ్యానించడం విశేషం. 

CLICKHERE : యాంకర్ సుమ ఎంతపని చేసిందో తెలుసా...???

తాను సినిమాల కోసం టామ్ బాయ్ కాలేదని.. ముందు నుంచి తన తీరే అంత అని ఆమె వ్యాఖ్యానించింది. స్నిగ్ధ ఇంకా ఏమందంటే.. నేను సినిమాల కోసమే ఇలా టామ్ బాయ్ అవతారం ఎత్తలేదు. నేను చిన్నప్నట్నుంచి అలాగే పెరిగాను. నాకు ఫ్రీగా ఉండడం ఇష్టం. మగవాళ్లతోనే ఎక్కువగా స్నేహాలు చేశాను. వాళ్లతో కలిసి బయట తిరుగుతాను. పార్టీలు చేసుకుంటాను. నాకు అమ్మాయిలతో సెట్ కాదు. కాలేజీలో చదివే రోజుల్లో అబ్బాయి గెటప్లో ఉంటూ అమ్మాయిలకు సైట్ కొట్టేదాన్ని. ఆ తర్వాత ఆ అమ్మాయిలు నా కోసం వెతుకుతూ ఉండేవాళ్లు. 

CLICKHERE : పవన్ వాడే ఫోన్ ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు

అది భలే కిక్కిచ్చేది. నాకు మేకప్ అంటే చిరాకు. షాపింగ్ అస్సలు నచ్చదు. టైమ్ ప్రకారం ఉండాలంటే ఇష్టం ఉండదు. అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు స్వేచ్ఛగా.. ఫ్రాంక్ గా ఉంటారు. ఓ పెగ్ పడితే చాలు.. మొత్తం నిజాలు మాట్లాడేస్తారు. నాకు మ్యూజిక్ ఇండస్ట్రీకి చెందిన ఒక వ్యక్తి ప్రపోజ్ చేశాడు. కానీ తన జీవితం బాగుండాలంటే నన్ను ఫ్రెండుగానే చూడమని చెప్పేశా అని స్నిగ్ధ చెప్పింది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top