కంటి అద్దాల వలన ముక్కుపై ఏర్పడే నల్లటి మచ్చల నివారణకు చిట్కాలు


కలబంద రసం నల్లటి మచ్చలను తొలగించే గుణం ఉంది. ఇది ముక్కపై నల్లని మచ్చ ఉన్న ప్రాంతంలో ప్రతి రోజూ రాసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేస్తే కొంతమేరకు ప్రయోజనం ఉంటుంది.
దోసకాయ ముక్కలు పిగ్మెంటేషన్ ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు. నల్లటి మచ్చ ఉన్న ముక్కుపై దోసకాయ ముక్కను పెట్టడం వల్ల ఈ మచ్చలు మాయమయ్యే అవకాశం ఉంది.
CLICKHERE : బిఎస్ఎన్ఎల్ 49 కే అద్బుతమైన ఆఫర్.. జియో కుడా పనికిరాదు
సహజంగానే నిమ్మకాయలో బ్లీచింగ్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల నిమ్మరసం కళ్ళజోడు మచ్చలను తగ్గించటంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది. నిమ్మరసం, నీరు లేదా తేనె మిశ్రమాన్ని నల్లటి మచ్చలపై పూయడం వల్ల ఈ మచ్చలను తొలగించవచ్చు.
ఈ సమస్యను సమర్ధవంతంగా పరిష్కరించటంలో తేనే సహాయపడుతుంది. నల్లని మార్కులపై తేనెను రాసి 15 నిమిషాల తర్వాత శుభ్రం చేయాలి. ప్రతి రోజు క్రమం తప్పకుండా కళ్ళజోడు నల్లని మార్కులపై రాస్తూ ఉంటే క్రమంగా తగ్గిపోతాయి.
CLICKHERE : భోజనానికి ముందు, భోజనం తర్వాత ట్యాబ్‌లెట్స్ ఎందుకు వేసుకోవాలో తెలుసా?

బంగాళదుంపలో కూడా బ్లీచింగ్ కాంపౌండ్స్ ఉన్నాయి. అందువలన 
కళ్ళజోడు నల్లని మచ్చలను తొలగించటంలో సహాయపడుతుంది. అలాగే, నారింజ తొక్కల పొడి కళ్ళజోడు మచ్చలను సమర్థవంతంగా తొలగిస్తుంది. 

నారింజ తొక్కల పొడిలో కొంచెం పాలను పోసి పేస్టుగా చేయాలి. ఈ పేస్టుని ప్రభావిత ప్రాంతంలో రాసి 10 నిముషాల తర్వాత శుభ్రం చేసినట్టయితే ఫలితం కనిపిస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top