బిఎస్ఎన్ఎల్ 49 కే అద్బుతమైన ఆఫర్.. జియో కుడా పనికిరాదు


మార్చి 31 వరకు జియో వినియోగదారులు ఆడిందే ఆట, పాడిందే పాట. అప్పటివరకూ ప్రతీరోజు 1GB డేటా అందుతూనే ఉంటుంది. మరి ఆ తరువాత పరిస్థితి ఏంటి ? జియో ఉచిత ఆఫర్ ని పొడిగించట్లేదు. ఉన్న జియో నంబర్ ని జియో ప్రైమ్ కి అప్ గ్రేడ్ చేసుకోమంటోంది. జియో ప్రైమ్ సేవలు ఏడాది కాలం పొందే అర్హత కోసం 99 రూపాయలు చెల్లించాలి. ఆ తరువాత నెలకి 303 రూపాయలు చెల్లిస్తే ఇప్పటిలాగే రోజుకి 1GB డేటా మీరు పొందవచ్చు. ఏడాది మొత్తానికి మీకయ్యే ఖర్చు ,3735 రూపాయలు.CLICKHERE : తొలిప్రేమ వాసుకి ఇప్పుడు ఎక్క‌డ ఉందో తెలుసా.?

మరోవైపు బిఎస్ఎన్ఎల్ ఒక అద్భుతమైన ఆఫర్ ని ప్రకటించింది. కాకపోతే ఇది మొబైల్ డేటా ఆఫర్ కాదు. బ్రాడ్ బ్యాండ్ + ల్యాండ్ లైన్ ఆఫర్. జియోతో పోల్చి చూసుకుంటే ఇంకా చీప్ ఆఫర్. 49 రూపాయలకే బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ సబ్ స్క్రిప్షన్ అందుబాటులోకి వచ్చింది. మార్చి 31 లోపే కనెక్షన్ తీసుకుంటే ఇంస్టాలేషన్ చార్జీలు ఉండవు. నెలకి 249 రూపాయలు చెల్లిస్తే అన్ లిమిటెడ్ హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలు మీకు అందుతాయి. ఏడాది మొత్తానికి అయ్యే ఖర్చు 3,307 రూపాయలు.

CLICKHERE : భోజనానికి ముందు, భోజనం తర్వాత ట్యాబ్‌లెట్స్ ఎందుకు వేసుకోవాలో తెలుసా?
జియో కన్నా ఏడొందల రూపాయలు తక్కువ, పైగా జియో లాగా రోజుకి 1 GB లిమిట్ కూడా లేదు. కాని ఇంట్లో వైఫై కనెక్షన్ కి, ల్యాండ్ లైన్ కాల్స్ కి మాత్రమే పనికివస్తుంది. జియో లాగా సిమ్ బేస్డ్ సర్వీస్ కాదు. ఇక రెండిట్లో మీకు సూట్ అయ్యే ఆఫర్ ఏదో మీరే డిసైడ్ చేసుకోండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top