బుద్ధున్నోడు ఎవరైనా శ్రీముఖిని ప్రేమిస్తాడా?

బుల్లితెరపై హాట్ హాట్ జంటలలో ప్రస్తుతం ప్రధానంగా వినిపించే పేర్లు శ్రీముఖి-రవి. హుషారైన యాంకరింగ్ తో ప్రేక్షకులను కట్టిపడేయడంలో సిద్ధహస్తులైన వీరి మధ్య ‘సంథింగ్ సంథింగ్’ ఉందంటూ ఎప్పుడూ గుసగుసలు వినపడుతుంటాయి. గతంలో వీటిపై శ్రీముఖి, రవిలు స్పందించి ఖండించినప్పటికీ, రోజు రోజుకు ఎంటర్టైన్మెంట్ పేరుతో వీరు నిర్వహించే షోలలో, వీరి మధ్య ఐకమత్యం బలపడుతుండడంతో ఎప్పుడూ వార్తల్లో వ్యక్తులుగా నిలుస్తున్నారు. 

CLICKHERE : ఎన్టీఆర్ నుండి వంశీ ఎలా దూరం అయ్యాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

అయితే తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించేందుకు చాటింగ్ లోకి వచ్చిన రవి, మరోసారి శ్రీముఖితో ఎఫైర్ విషయంపై స్పందించారు. ‘బుద్ధున్నోడెవడైనా శ్రీముఖిని ప్రేమిస్తాడా?’ అన్న రవికి అనేక ప్రశ్నలను నెటిజన్లు వదిలారు. ‘నువ్వు, శ్రీముఖి చేస్తున్న ఓవర్ యాక్షన్ ను చూడలేకపోతున్నాం అయ్యా?’ అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘నీ చేతిలో రిమోట్ ఉందిరా అయ్యా’ అంటూ రవి ఘాటుగా సమాధానమిచ్చాడు. మీ కార్యక్రమంలో బూతులెక్కువుంటున్నాయని ఒక నెటిజన్ విమర్శించగా, అన్ని కార్యక్రమాలు ఒకేలా ఉండవని, ఆ కార్యక్రమంలో బూతులు ఎక్కువయ్యాయన్న సంగతి తనకు తెలుసని అన్నాడు. 

CLICKHERE : యాంకర్ సుమ ఎంతపని చేసిందో తెలుసా...???

తమ అఫైర్ గురించి ఎంత ఎక్కువ రాస్తే, తాము అంత ఫేమ్ లో ఉంటామని, శ్రీముఖితో తన అఫైర్ గురించి ఏమైనా రాసుకోవచ్చని, తనకేమీ ఇబ్బందులు లేవని కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పారు రవి. బుల్లితెరపై బిజీ యాంకర్లుగా దూసుకుపోతున్న వీరిద్దరూ ఈ ‘ఎఫైర్’ వార్తలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని, రవి చేసిన తాజా వ్యాఖ్యలతో స్పష్టమైంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top