జియోకు ధీటుగా బంపర్ ఆఫర్‌ ప్రకటించిన ఎయిర్‌టెల్


తాజాగా టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ఓ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్ మేరకు… కేవలం రూ.345 రిచార్జ్‌తో రోజుకు 1 జీబీ డాటా చొప్పున 28 రోజులపాటు 28 జిబి డాటా, అపరిమిత లోకల్, నేషనల్ ఫోన్‌కాల్స్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. అయితే 1 జిబి డాటాను పగలు 500 ఎంబీలు, రాత్రి సమయంలో 500 ఎంబీల చొప్పున వినియోగించుకునే పరిమితిని విధించింది. 
CLICKHERE : మీ పేరు ఈ అక్షరంతో మొదలవుతుందా? ఐతే మీ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకోండి!!

ఈ ఆఫర్‌ను పొందాలంటే 4జి మొబైల్ కలిగిన యూజర్లు మార్చి 31 లోపు రూ.345తో రిచార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. మార్చి 31 లోపు చేయించుకున్న వారు తదుపరి 11 నెలలు ఇదే తరహా ఆఫర్‌ను పొందవచ్చు. జియో ప్రైమ్ ఆఫర్‌‌కు ఛాలెంజ్ విసురుతూ ఈ సరికొత్త ఆఫర్‌ను ఎయిర్ టెల్ ప్రకటించడం గమనార్హం.
CLICKHERE : ఇవి తింటే గాస్ట్రిక్ సమస్యలను దూరం చెయ్యొచ్చు...!

అలాగే, రూ.549తో రిచార్జ్ చేసుకునే కస్టమర్లు మాత్రం రోజుకు 1 జీపీ డాటాను ఎలాంటి ఆంక్షలు లేకుండా వినియోగించుకోవచ్చు. ఇది కూడా 28 రోజుల కాలపరిమితి కలిగివుంటుంది. అన్‌లిమిటెడ్ ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్న రూ.145 ప్లాన్‌లోనూ మార్పులు చేసింది ఎయిర్‌టెల్. ఈ మొత్తంతో రీచార్జ్ చేయించుకుంటే 28 రోజులపాటు ఎయిర్‌టెల్ టు ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ కాల్స్, 2 జిబి డాటా వస్తుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top