ఈ ఎయిర్ టెల్ ప్లాన్ తెలిస్తే.. ఇక జియో గురించి ఆలోచించరు!!


ఇప్పటిదాకా అంటే ఫ్రీ ఇచ్చి మొబైల్ కస్టమర్లు మొత్తాన్ని తనవైపు తిప్పుకుంది రిలయన్స్ జియో.. కాని ఇక ఏప్రిల్ 1నుంచి అందరితో పాటుగానే రీఛార్జి చేసుకోవాల్సిందేనని రేట్ల చిట్టా ప్రకటించింది. నెట్ వర్క్ స్పీడ్ తక్కువగా ఉండడం, కొనుగోలు చేసి వాడాల్సి రావడం తదితర కారణాలతో జియోపై క్రేజీ తగ్గుతోంది. ఇది గమనించిన పోటీ టెలికం సంస్థలు తమదైన ఆఫర్లతో ముందడుగు వేస్తున్నాయి. 

ఇండియా నం.1 టెలికాం సంస్థ ఎయిర్ టెల్ ఇప్పటికే 345 రూపాయల ప్యాక్‌తో ప్రీపెయిడ్ కస్టమర్లకు అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు రోజుకు 1జీబీ డేటాను అందిస్తోంది. ఈసారి ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ సేవలపై దృష్టిసారించింది. పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం ఓ చౌక ప్యాక్‌ను అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. అదేమిటంటే..

ఎయిర్ టెల్ పోస్ట్‌పెయిడ్ కస్టమర్లకు 150 రూపాయల సరికొత్త ప్యాక్‌ను అందించనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా బయటకు వచ్చింది. 150 రూపాయల ప్యాక్‌తో రోజుకు 1జీబీ డేటాను 28రోజుల వ్యాలిడిటీతో అందించడానికి ఎయిర్‌టెల్ వ్యూహరచన చేస్తోంది. ఈ 1జీబీ డేటాలో 500 ఎంబీ పగలు, 500 ఎంబీ రాత్రి 12 తర్వాత వినియోగించుకునే విధంగా ప్యాక్‌ను ప్రవేశపెట్టనుంది. జియోను ఆశ్రయిస్తున్న వారిలో ఎక్కువ మంది డేటానే ఆశిస్తున్నారని ఎయిర్‌టెల్ భావిస్తోంది. 

అందులో భాగంగానే వాయిస్ కాల్స్‌తో సంబంధం లేకుండా ఈ 150 రూపాయల మంత్లీ డేటా ప్యాక్‌ను అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. అదే జరిగితే ఎంచక్కా ఎయిర్ టెల్ పోస్టు పెయిడ్ కనెక్షన్ తీసుకుని ఇక జియో గురించి మర్చిపోతారని భావిస్తోందని తెలుస్తోంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top