బంపర్ ఆఫర్! రూపాయకే 1జిబి డేటా…


జియో ఆఫర్ల వర్షానికి దీటుగా ఐడియా సెల్యులార్ శుక్రవారం ఓ సరికొత్త ఆఫర్ ప్రకటించింది. జియో ఎదుర్కివడానికి టెలికాం రంగంలో మిగిలిన కంపెనీలు విశ్వప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే 4జీ మొబైల్ యూజర్లకు రోజుకి 1జీబీ చొప్పున 4జీ డేటాను అందించనుంది. నెలకు రూ.300 యాడ్ ఆన్ ప్యాక్ తో రోజుకు 1 జీబీ చొప్పున నెల రోజుల పాటు 4జీ డేటాను యూజ్ చేసుకోవచ్చు.

అంతేకాకుండా రూ.50 అదనంగా చెల్లిస్తే, రూ.349 లేదా అంతకంటే ఎక్కువ రెంటల్ ఉన్న పోస్ట్ పెయిడ్ కస్టమర్లుకు మూడు నెలల పాటు ఈ ఆఫర్ ను పొందొచ్చని ఐడియా స్పష్టం చేసింది. . ఒకవేళ ఆతరవాత కూడా 2018 వరకు ఈ డిస్కౌంట్ ఆఫర్ ను పొందాలంటే రూ.199-రూ.349 మధ్య ప్లాన్ లో అదనంగా రూ.200, రూ.349-రూ.498 మధ్య ప్లాన్ లో అదనంగా రూ.50 చెల్లిస్తే సరిపోతుందని తెలిపింది.

ఈ ప్లాన్స్ నమోదు ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటుందని, ఈ ఆఫర్ కేవలం 4జీ హ్యాండ్ సెట్లు వినియోగించే యూజర్లకు మాత్రమేనని తెలిపింది. ఈ కంపెనీల పోటీలో యూజర్లకు ఆఫర్ల మీద ఆఫర్లతో పండగలా ఉంటుంది…
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top