టెలికామ్ రంగంలో ఒక సెన్సేషన్ సృష్టించిన జియో ప్రైమ్ మెంబర్‌షిప్, సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్ల గడువు ముగియడంతో ఇప్పటికీ రీచార్జ్ చేసుకోని యూజర్లకు గుడ్‌బై చెప్పేందుకు రెడీగా ఉంది.
‘అవాంతరాలు లేని’ సేవలకోసం ఇప్పుడే రీచార్జ్ చేసుకోండి అంటూ ప్రచారం చేసింది. అయినా కూడా చేసుకోనివారికి ఇక సెలవు అంటుంది. సెప్టెంబర్ నెల నుంచి ఆరు నెలలకు పైగా ఫ్రీ ఆఫర్లు ఇచ్చిన జియో ఏప్రిల్ 1 నుంచి చార్జీలు తీసుకోవడం మొదలుపెట్టింది. మొదట రూ.99కి సంవత్సరం మేర ప్రైమ్ మెంబర్‌షిప్, తరవాత రూ.303 లేదా ఆపైన రీచార్జ్ చేసుకుంటే మూడు నెలల పాటు రోజుకు 1జీబీ డేటాసేవలు అందుకోవచ్చని ఆఫర్ ఇచ్చింది.
‘ధనాధన్ ఆఫర్’లో రూ.309తో రీచార్జ్ చేసుకుంటే మూడు నెలలపాటు రోజుకు 1జీబీ డేటా సేవలు అని ముందుకు వచ్చింది.ఇప్పటివరకు ప్రాథమిక సభ్యుత్వంగానీ, రీచార్జ్‌గానీ చేసుకోని వారిని జియో సేవలనుంచి డిస్‌కనెక్ట్ చేస్తుందని చెబుతున్నారు.


