షాకింగ్: SBI ఖాతాదారుల డబ్బులు మాయమవుతున్నాయి.. ఎందుకో తెలుసా?

మన దేశంలో మోసాలు సంఖ్య పెరిగిపోయింది. ఎక్కడ చూసినా మోసమే.. అన్ని మోసాలకు మూల కారణం డబ్బే. ప్రతీ మనిషి తను సంపాదించిన సొమ్మును అకౌంట్స్ రూపంలో బ్యాంకులలో దాచుకుంటారు. ఆంధ్రాబ్యాంక్, స్టేట్ బ్యాంకు, ఎక్సెస్ బ్యాంకు ఇలా సొమ్ము దాచుకోవడానికి చాలానే బ్యాంకులు ఉన్నాయి. మన ప్రధాని నరేంద్ర మోడీ గారు పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు బ్యాంకు ఏ.టీ.ఎమ్ ల నుండి డబ్బులు రాకా జనాలు ఇబ్బందులు పడ్డారు. అప్పుడే ఆయన డబ్బులు ఆన్లైన్ రూపంలో చెల్లింపులు చేసేలా అందరి దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ ద్వారానే డబ్బులు చెల్లిస్తున్నారు. ప్రతీ బ్యాంక్ కు వాళ్ళ సొంత ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుంది.

ఆన్లైన్ బ్యాంకింగ్ చేసే కస్టమర్స్ అందరికి వారి యూసర్ నేమ్ మరియు పాస్వర్డ్ బ్యాంకు అందిస్తుంది. ఆన్లైన్ పేమెంట్స్ అన్ని సులభంగా జరుగుతున్నాయి అనుకుంటున్న వారికీ ఒక షాకింగ్ న్యూస్. తాజాగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇప్పుడు బ్యాంకు అఫీషియల్ వెబ్ సైట్ల రూపంలో ఆన్లైన్లో ఫేక్ వెబ్ సైట్స్ దర్శనమిస్తున్నాయి. కనుక ఆన్లైన్ ద్వారా పేమెంట్స్ చేసే కస్టమర్స్ ఇప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. మనము అసలు ఒక వెబ్ సైట్ ఓపెన్ చేయగానే దాని చిరునామాలో చూడండి.


అక్కడ మీకు http://. ఈ విధంగా ఉన్నట్లు అయితే అది భద్రత లేని వెబ్ సైట్ అని అర్ధం. అదే http:// ఈ విధంగా ఉంటే దీని ప్రక్కనే ఒక లాక్ బొమ్మ కూడా ఉంటుంది. ఇది సురక్షితమైన వెబ్ సైట్ అని అర్ధం. అలాగే హ్యాకర్స్ ఇంకో అడుగు ముందుకేసి స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా అఫీషియల్ వెబ్ సైట్ కు ఏకంగా ఫేక్ వెబ్ సైట్ నే సృష్టించారు. ఒకసరి మీరే చూడండి అది ఎలా ఉంటుందో. స్టేట్ బ్యాంకు కస్టమర్స్ ఆన్లైన్ బ్యాంకింగ్ చేసేందుకు వెబ్సైటు ఓపెన్ చేయగానే చిరునామాలో https://retail.onlinesbi.com/retail/login.htm ఈ విధంగా మనకు కనబడుతుంది. ఇది సురక్షిత వెబ్సైటు దీని ప్రక్కన లాక్ బొమ్మ కూడా ఉంటుంది కానీ హ్యాకర్స్ దీనికి ఫేక్ గా రూపొందించిన వెబ్ సైట్ కు మాత్రం http://onlinesbi.me/login అని ఉంటుంది. కాబట్టి కస్టమర్స్ దీనిని చూసి జాగ్రత్త వహించండి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top