మీ జియో సిమ్ ఈ కేటగిరీలో ఉంటే బ్లాక్ చేస్తారు!!

దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది ఇప్పుడు జియో సిమ్ వాడుతున్నారు. సెప్టెంబర్ 2016న మొదలైన ఫ్రీ 4జీడేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ కొనసాగుతుండడంతో జియో వాడకమే ఇప్పుడు దేశంలో నంబర్ 1 గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక తాజాగా ప్రైమ్ మెంబర్ షిప్ తీసుకోవాలని జియో యాజమాన్యం సూచించగా ఏడు కోట్ల మంది ఓకే చేశారు. ప్రారంభంలో అడిగిన వారికి అడిగినట్టు సిమ్ ఇచ్చేశారు. ప్రస్తుతం ఆ లెక్కలను సరిచేసే పనిలో పడ్డారు జియో అధికారులు. సిమ్ తో ఆధార్ లింక్ చేసుకుంటే సరే.. లేకుంటే సిమ్ బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. నాన్‌ వెరిఫైడ్‌ సిమ్‌ కార్డులను నిషేధించనున్నట్లు సమాచారం. అలాగే..

ఈ కేవైసీ సమర్పించని ఖాతాదారులను ఎస్ఎంఎస్ ద్వారా హెచ్చరిస్తుందట జియో యాజమాన్యం. లేదంటే ప్రస్తుతం వాడుతున్న జియో సిమ్‌ ద్వారా 1977 నెంబర్‌ కాల్‌ చేసిన టెలీ వెరిఫికేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది. ఇక లోకల్‌ అధార్‌ కార్డుతో జియో సిమ్‌ తీసుకున్నవారికి ఎలాంటి సమస్య ఉండదు. నాన్‌ లోకల్‌ ఆధార్‌ తో తీసుకుంటే మాత్రం టెలీ వెరిఫికేషన్‌ చేయించుకోవాల్సిందే. జియో ఇప్పటికే ఈ స్క్రూటినీ ప్రక్రియ మొదలు పెట్టిందని సమాచారం. 


ఏప్రిల్‌ 1 నుంచి ఈ వెరిఫికేషన్‌ ప్రక్రియ మొదలైంది. అంటే ఆధార్ అడ్రస్ ఒక రాష్ట్రంలో ఉండి సిమ్ వేరొక రాష్ట్రంలో ఉంటే వెరిఫై చేయించుకోవాలి. నాన్ వెరిఫికేషన్ సిమ్ కార్డులను భద్రతా కారణాల క్రమంలోనే బ్లాక్ చేసే అవకాశం ఉంది. మీ సిమ్ వెరిఫికేషన్ అయ్యిందో లేదో ఓసారి చూసుకోండి. లేకుంటే సిమ్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top