మొబైల్‌ కనిపించకపోతే... గూగుల్‌తో ఆచూకీ

చేతిలో నిత్యం కనిపించే మొబైల్‌ ఫోన్‌ను ఆఫీసుకి వెళ్లే హడావుడిలోనో, పనుల ఒత్తిడిలోనో ఎక్కడో పెట్టేసి దాని కోసం వెతుక్కోవడం అనుభవంలో ఉన్న విషయమే. ఎక్కడికైనా తొందరగా వెళ్లాలనుకునే సమయంలో ఇలాంటి ఇబ్బంది మరింతగా ఆందోళనకు గురి చేస్తుంది. మీది ఆండ్రాయిడ్‌ ఫోన్‌ అయితే మాత్రం ఇక ముందు అలాంటి ఆందోళన అవసరం లేదంటోంది గూగుల్‌. వెంటనే కంప్యూటర్‌ ఓపెన్‌ చేసి గూగుల్‌ సెర్చ్‌లోకి వెళ్ళి ‘ఫైండ్‌ మై ఫోన్‌’ అని టైప్‌ చేస్తే చాలు ఆ మొబైల్‌ సుమారుగా ఎక్కడ ఉండి ఉంటుందన్న ఆచూకీ డెస్క్‌టా్‌పపై దర్శనం ఇస్తుందని చెబుతోంది. 

మొబైల్‌ పొరపాటున కారు సీట్‌లో ఉండిపోయినా, సోఫా కుషన్ల కిందకు దూరిపోయినా, మంచం మీద దిళ్లలో కూరుకుపోయినా క్షణాల్లో దాని ఆచూకీ చెప్పేస్తామని గూగుల్‌ తన బ్లాగ్‌పో్‌స్టలో తెలిపింది. కస్టమర్లు చేయాల్సిందల్లా ఒక్కటే... తమ రిజిస్టర్డ్‌ మొబైల్‌లో గూగుల్‌ ఆప్‌ లేటెస్ట్‌ వెర్షన్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూ స్మార్ట్‌ఫోన్‌ లొకేషన్‌ సర్వీసు ఆన్‌లో ఉంచుకోవడమే. అందులోని ఆండ్రాయిడ్‌ డివైస్‌ మేనేజర్‌ ఆ మొబైల్‌ రింగ్‌ అయ్యేలా చేస్తుంది. అందులోని రింగ్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే మొబైల్‌ ఐదు నిమిషాల పాటు రింగ్‌ అవుతుంది. ఒకవేళ మొబైల్‌ ఎవరైనా దొంగిలించినా కూడా అందులోని విలువైన సమాచారాన్ని ఆ సర్వీస్‌ సహాయంతో ఇంట్లో ఎరేజ్‌ చేసేయవచ్చని గూగుల్‌ తెలిపింది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top