రెడీగా ఉండండి… రూ.2 వేలకే 4 జీ స్మార్ట్ ఫోన్

భారత మొబైల్‌ వినియోగదారులను చైనా ఫోన్స్‌ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చైనా నుండి వచ్చిన ప్రతి మొబైల్‌ కూడా ఇండియాలో విపరీతమైన డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో చైనా నుండి ఇంకా కొత్త కొత్త బ్రాండ్స్‌ కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్‌ మొబైల్‌ తయారీ కంపెనీ అయిన మైక్రోమ్యాక్స్‌ వెనుకబడి పోయింది. చైనా ఫోన్‌ల పోటీని తట్టుకోవడంలో విఫలమైంది. దాంతో మళ్లీ పుంజుకునేందుకు మైక్రోమ్యాక్స్‌ ప్రయత్నాలు మొదలు పెట్టింది. జియో వచ్చిన తర్వాత 4జీ ఫోన్‌ల వాడకం విపరీతంగా పెరిగింది. 

దాన్ని క్యాష్‌ చేసుకునేందుకు మైక్రోమ్యాక్స్‌ సిద్దమైంది. ప్రస్తుతం మార్కెట్‌లో 4జీ స్మార్ట్‌ ఫోన్‌ కావాలంటే కనీసం 5 వేల రూపాయలు తప్పని సరి. కాని మైక్రోమ్యాక్స్‌ కేవలం రెండు వేల రూపాయలకే 4జీ స్మార్ట్‌ ఫోన్‌ను ఇవ్వబోతోంది. మైక్రోమ్యాక్స్‌ భారత్‌ 1 పేరుతో ఈ 4జీ మొబైల్‌ను విడుదల చేయబోతుంది. కొత్త ఫోన్ ఫీచర్స్ ఇలా ఉంటాయి..

మైక్రోమ్యాక్స్‌ భారత్‌ 1 ఫీచర్స్‌ :
* 4 ఇంచ్ డిస్‌ప్లే,
* 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 512 ఎంబీ ర్యామ్
* 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
* డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
* 2 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్
* 0.3 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
* 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0
* 1300 ఎంఏహెచ్ బ్యాటరీ
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top