హైపర్ ఆది అంటే ఒకప్పుడు ఎవరికీ లేలియాడు కనీసం చూసి కూడా ఉండివుండరు అలాంటి ఆది ఇప్పుడు ఎంత పాపులర్ అయ్యాడో అంత పాపులర్ అవ్వడానికి కారణం ఎవరో తెలుసా?మల్లెమాల ప్రొడక్షన్ లో ఈటీవీ లో ప్రతి గురువారం ప్రసారమయ్యే జబర్దస్త్ షో ఆదిని జనాలకు పరిచయం చేసింది.ఇంగినీరింగ్ చదివి ఏంతోచక ఒక స్కిట్ రాసి దానితో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి తన పంచ్ లతో అందరిని నవ్విస్తూ జబర్దస్త్ లో సెట్ అయిపోయాడు.ఇప్పుడు ఆది అంటే జబర్దస్త్ ,జబర్దస్త్ అంటే ఆది అనే అంట ఎత్తుకు ఎదిగిపోయాడు.
తన పంచ్ లతో జనాలనే కాదు సెట్ లో ఉన్న రోజా,నాగబాబు ని కూడా బాగా నవ్విస్తాడు.అతని పంచ్ లకు అందరు ఫిదా అయ్యి అతనిని జబర్దస్త్ టీంలీడర్ గా చేసేసారు.ఇప్పుడు హైపర్ ఆది రేంజ్ ఏంటో మనందరికీ తెలుసు.తాజాగా హైపర్ ఆది కి సినిమాలలో కూడా ఆఫర్స్ వస్తున్నాయి.ఏకంగా త్రివిక్రమ్ దర్శకత్వంలోనే ఛాన్స్ వచ్చేంత ఎదిగిపోయాడు.ప్రస్తుతం ఆది చేతిలో 3,4 సినిమా ఆఫర్స్ ఉన్నాయి.
తన స్కిట్ మరింత పండాలి అనుకుంటే అప్పుడప్పుడు సెట్ లో ఉన్న యాంకర్స్ రేష్మి,అనసుయని కూడా వాడుకుంటాడు.అసలు ఆది టీం లీడర్ అవ్వడానికి కారణం మాత్రం ఒక స్కిట్ ‘అందం ఇందోలం అదిరే తాంబూలం’ అంటూ ఒక స్కిట్ చేశాడు ఆ స్కిట్ లో ఆది వేసే పంచ్ లు మాములుగా ఉండదుఆ దెబ్బతో ఆది కాస్త హైపర్ ఆది అయిపోయి టీం లీడర్ గా ప్రత్యేక్షమయ్యాడు.


