13వతేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్‌బోర్డు సెక్రటరీ ఉదయలక్ష్మి తెలిపారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ… రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో ఈ ఫలితాలను విడుదల చేస్తారని తెలిపారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తున్నామని, గతేడాదికంటే ముందుగానే ఫలితాలు విడుదల చేస్తున్నామని ఉదయలక్ష్మి తెలిపారు. ఇంటర్ ప్రథమ.. ద్వితీయ సంవత్సరం కలిపి 10.3 లక్షల మంది పరీక్షలు రాశారని ఆమె పేర్కొన్నారు.


