ఆన్ లైన్ లో ఇంటర్మీడియట్ ఫలితాలు పొందండిలా

రాష్ట్రంలో 2017 సంవత్సరానికి గాను ఇంటర్మీడియెట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరపు పరీక్షల ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. విజయవాడలో మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా ఈ ఫలితాలను విడుదల చేయనున్నామని ఇంటర్మీడియెట్‌ బోర్డు తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 1 నుంచి 17 వరకు జరిగిన ఈ పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు 10.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో మొదటి సంవత్సరం విద్యార్థులు 5,23,099 మంది, రెండో సంవత్సరం విద్యార్థులు 5,08,186 మంది ఉన్నారు. 1,445 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించారు.

ఈ సేవ, మీసేవ, రాజీవ్‌ సిటిజన్‌ సర్వీస్‌సెంటర్లు, ఏపీ ఆన్‌లైన్‌ సెంట్లర్ల ద్వారా కూడా పరీక్ష ఫలితాల సమాచారాన్ని పొందవచ్చని బోర్డు అధికారులు పేర్కొన్నారు.

అలాగే విద్యార్ధులు ఇంటర్ నెట్ ద్వారా తమ ఇంటర్ ఫలితాలు పొందాలనుకుంటే www.bieap.gov.in ద్వారా పొందవచ్చు. ఇంటర్ నెట్ ద్వారా తమ ఇంటర్ ఫలితాలు పొందాలనుకునే విద్యార్ధులు తప్పకుండా తమ రోల్ నెంబర్ , డేట్ అఫ్ బర్త్, వంటి వివరాలు తెలియ చేయాల్సి ఉంటుంది.

ఆన్ లైన్ లో ఇంటర్ ఫలితాలు పొందే విధానం
ముందుగా www.bieap.gov.in వెబ్ సైట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
ఇంటర్ ఫలితాలు తెలిపే లింక్ ఓపెన్ చేయండి.
అక్కడ అడిగిన వివరాలు కరెక్ట్ గా ఎంటర్ చేయండి.
తరువాత ఓకే బటన్ క్లిక్ చేయండి.
మీ ఫలితాలు డిస్ప్లే చేయబడతాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top