రిలయన్స్ అంటే అంతే మరి. అందుకే ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు అయ్యే స్థాయికి కూడా వెళ్ళేలానే ఉన్నారు. ఇప్పుడు జియోతో కూడా అదే స్థాయి సంచంలనం సృష్టిస్తున్నారు. ఎట్టి పరిస్థితులను టెలికాం రంగంలో ఇంకెవ్వరూ ఉండకూడదు. ఇట్స్ ఒన్ అండ్ ఓన్లీ జియో అనేలా పరిస్థితి ఉండాలని చెప్పి తపిస్తోంది రిలయెన్స్. అందుకే వరుసగా ఆఫర్స్ మీద ఆఫర్స్ ప్రకటిస్తోంది. ఆ ఆఫర్స్ చూసినవాళ్ళకే రిలయన్స్ దెబ్బ ఎక్కడో అక్కడ పడడం ఖాయమని చెప్తూ ఉన్నారు.
ఇఫ్పుుడ జియో నుంచి ఫస్ట్ స్ట్రోక్ వచ్చింది. దాదాపు పది లక్షల మంది ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి వచ్చింది. జియో దెబ్బకు 2016-17కి గాను దేశీయ టెలికాం కంపెనీల రాబడి 4900 కోట్లు పడిపోయింది. 2015-16లో 1.93లక్షల కోట్లున్న ఈ కంపెనీల ఆదాయం …సంవత్సరం తిరిగేసరికి 1.88లక్షల కోట్లకు డౌన్ అయింది. ఇప్పుడు ఇంకా తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఐడియా, ఎయిర్‌టెల్ లాంటి సంస్థలు ఎలాగో ఒకలాగా నెట్టుకొస్తూ ఉన్నా మిగతా చిన్నా చితక సంస్థలన్నీ కూడా మూతపడేలా ఉన్నాయి. ఎయిర్‌టెల్‌తో సహా అగ్రశ్రేణి కంపెనీలన్నీ కూడా ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నాల్లో పడ్డాయి.
మొత్తంగా దాదాపు పదలక్షల మంది ఉద్యోగాలు ఊడడం ఖాయమని తెలుస్తోంది. అంతే కాకుండా ఈ ట్రెండ్ ఇలాగే కంటిన్యూ అయితే భవిష్యత్‌లో టెలికాం రంగంలో రెండు మూడు కంపెనీలకు మించి ఉండవని చెప్తున్నారు. అదే జరిగితే రేట్ల విషయంలో గుత్తాధిపత్యం మొత్తం కూడా ఆ రెండు మూడు కంపెనీల చేతుల్లోకి వెళ్ళడం ఖాయం. ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి మరి.


