పదేళ్ళ పాటు ఫ్లాప్స్‌లో ఉన్న నితిన్ పవన్ నామ స్మరణతో ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందేలాంటి సినిమాలతో సూపర్ హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత కూడా తన ప్రతి సినిమాలోనూ పవన్ నామ స్మరణ ఉండేలా జాగ్రత్తపడతాడు నితిన్. ఇక ఆ తర్వాత చాలా మంది హీరోలు అదే బాట పట్టారు. తాజాగా వెంకటేష్ కూడా అదే పవన్ నామస్మరణ నమ్ముకున్నాడు. గురు సినిమాలో పవన్ జపం మామూలుగా ఉండదు. ఈ సినిమా హీరోయిన్ పవన్ కళ్యాణ్‌కి పెద్ద ఫ్యాన్. పవన్ కటౌట్ కనిపిస్తే చాలు ఊగిపోతుంది. డ్యాన్సులే డ్యాన్సులు. ఇక మెడపై చేత్తో రుద్దుకునే మేనరిజమ్ అన్నా కూడా పడి చచ్చిపోతుంది. హీరోయిన్ క్యారెక్టర్‌ని డిజైన్ చేయడంలోనే ఈ రేంజ్‌లో పవన్ కనిపించినప్పుడు ఇక సీన్స్‌లో మాత్రం పవన్ జపం లేకుండా ఎలా ఉంటుంది. చాలా సీన్స్‌లో పవర్ స్టార్ జపం ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆ సీన్స్‌కి పవన్ ఫ్యాన్స్ కూడా బాగానే ఎంటర్టైన్ అయ్యారు. ఆ ఇంపాక్ట్ అంతా కలెక్షన్స్‌లో కనిపిస్తోంది.
అయితే ఇక్కడే దిమ్మ తిరిగిపోయే ఓ ట్విస్ట్ ఉంది. గురు కలెక్షన్స్ దెబ్బకు కాటమరాయుడికి నష్టం జరిగిందని ట్రేడ్ పండిట్స్ చెప్తున్నారు. ఆ రకంగా చూసుకుంటే మాత్రం పవన్ నామస్మరణతో పవన్ సినిమాకే ఎసరు పెట్టారనుకోవాలా? లేకపోతే తన సినిమాకంటే భక్తుడి సినిమాకే ఎక్కువ కలెక్షన్స్ వచ్చేలా అభిమానులు ముద్దుగా దేవుడు అని పిలుచుకునే పవన్ చేశాడని అనుకోవాలా? ఈ ఇష్యూపై పవన్ ఫ్యాన్స్ కన్ఫ్యూషన్స్ మామూలుగా లేవు. ఏంటో చిత్రాతి విచిత్ర పరిస్థితి.


