కారణం వారు పలు సినిమాలతో బిజీ గా ఉండడమే. నాగ చైతన్య రారండోయ్ వేడుక చూద్దాం చిత్రంతో ఫుల్ బిజీగా మారిపోయాడట. ఆ తర్వాత మరో స్క్రిప్టు రెడీగా వున్నదట. అలాగే సమంత కూడా రాజుగారి గది 2, మహానటి చిత్రాలతో పాటు రామ్ చరణ్ సరసన నటించేందుకు ఒప్పుకుంది. ఈ చిత్రాలు పూర్తయ్యేసరికి ఏడాది పడుతుందంటున్నారు.
దీనికి తోడు ఎన్టీఆర్ కూడా సమంతను తన తాజా చిత్రంలో నటింపజేయాలని చూస్తున్నాడట. ఇకా ఇద్దరి డైరీ పూర్తిగా బిజీగా ఉండటంతో ఈ మూవీస్‍ని కంప్లీట్ కావడానికి కనీసం ఏడాది టైం అయినా పడుతుందని తెలుస్తోంది. అందుకే వీరి పెళ్లికి ఏడాది టైం పడుతుందని నాగ్ తో చెబితే సరే మరి కానివ్వండి అన్నారని సమాచారం. వీరి పెళ్లి ఇంకా వాయిదా పడటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని నాగ్ టెన్షన్ పడుతున్నాడట.

