లేకపోతే ఇంత హఠాత్తుగా.. ప్రత్యక్ష పోటీ లేకుండా.. తనయుడిని మంత్రిని చేయాలనేది బాబు తలంపు కాదనే మాట వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల వరకూ లోకేష్ ను ఆఫుదామనే బాబు అనుకున్నాడని, అయితే అవతల కేటీఆర్ తోపోలిక పెట్టుకుని.. భర్తను మంత్రిగా చేసేంత వరకూ బ్రాహ్మణి పట్టువదలనట్టుగా ప్రచారం జరుగుతోంది. ఆమె ఒత్తిడితో బాబు చేసేది లేక లోకేష్ ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసి మంత్రిగా చేస్తున్నాడని సమాచారం.
లోకేష్ ఎమ్మెల్సీగా నామినేట్ కావడం పై రకరకాల విమర్శలు వస్తున్నా, బాబు కిమ్మనకుండా ఆయనను మంత్రి చేసే పనిలో ఉన్నాడు. బ్రాహ్మణి ఒత్తిడే కారణంగా తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని బ్రాహ్మణి అనుకుంటోంది. అది కూడా ఎంపీగా పోటీ చేయాలని.. విజయవాడ అయితే అందుకు తగిన వేదిక అవుతుందని బ్రహ్మణి లెక్కలేసిందని, ఈ మేరకు ఆమె మామ బాబుకు అల్టిమేటం జారీ చేసినట్టుగా సమాచారం. తాత ఎన్టీఆర్ సొంత జిల్లా కావడం, అక్కడ సొంత కులం ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో బ్రహ్మణి విజయవాడ నుంచి పోటీ చేయాలని అనుకుంటోందని.. చంద్రబాబు కూడా చేసేది లేక ఆమెను కాదనే అవకాశం లేక ఓకే చెప్పాడని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
మొత్తానికి ఎన్టీఆర్ మనవరాలిని కోడలిగా చేసుకుంటే రాజకీయంగా వారిని కట్టేసినట్టు అవుతుందన్న బాబుకు కోడలి తీరుతో తలపోటు మొదలైందని, బాబును ఆమె ఈ టర్మ్ పూర్తయ్యేంత వరకూ కూడా సీటులో కూర్చోనిచ్చే టట్టు లేదనే మాట వినిపిస్తోంది. అప్పట్లో మామకు చుక్కలు చూపించిన బాబుకు, ఇప్పుడు కోడలు చుక్కలు చూపిస్తోంది.


