మాల్యా విల్లాను కొనుగోలు చేసిన ఆ హీరో ఎవరు? ఎన్ని కోట్లకు కొన్నాడో తెలిస్తే షాక్ అవుతారు

విచ్చలవిడిగా లోన్లు తీసుకుని, బ్యాంకులకు టోపీ పెట్టి ఎంచక్కా విదేశాలకు చెక్కేశాడు లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా. ఒక్కటేమిటి.. దాదాపు అన్ని జాతీయ బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఎగనామం పెట్టేశాడు ఈ విలాస పురుషుడు. దేశం విడిచి వెళ్లిపోయిన అతడు ఇప్పటిదాకా ఇండియా వైపు కూడా చూడలేదు. దీంతో అతగాడి ఆస్తులన్నిటినీ వేలం వేస్తున్నాయి బ్యాంకులు. తాజాగా మాల్యా విల్లాను వేలానికి పెట్టాయి. 

ఆ విల్లాను టాలీవుడ్ హీరో సచిన జోషి సొంతం చేసేసుకున్నాడని టాక్. గోవాలో ఉన్న విలాసవంతమైన కింగ్‌ఫిషర్ విల్లాను రిజర్వ్‌డ్ ధర రూ.73 కోట్ల కంటే ఎక్కువే పెట్టి కొనేందుకు ముందుకు వచ్చాడట సచిన్. అంతేకాదు.. విల్లా అమ్ముడుపోయినట్టు ఎస్బీఐ చైర్‌పర్సన్ అరుంధతి భట్టాచార్య ధ్రువీకరించినా ఎవరు కొనుగోలు చేశారన్నది మాత్రం వెల్లడించలేదు.

మార్జినల్ ప్రైస్ రూ.73 కోట్లకు కొంచెం ఎక్కువే అంటే రూ.73.01 కోట్లకు సచిన్ ఆ విల్లాను సొంతం చేసుకున్నట్టు చెబుతున్నారు. ఈ వారంలోనే ద్వైపాక్షిక ఒప్పందం ద్వారా సచిన్ జోషి ఆ విల్లాను సొంతం చేసుకున్నాడని అక్కడి వర్గాలు చెబుతున్నాయి. గోవాలోని ఆగ్వాడా కోటకు వెళ్లే మార్గంలో కాండోలిమ్‌లో 12,350 చదరపుటడుగుల మేర విస్తరించి ఉంది మాల్యా విల్లా. వచ్చే నెలలో సచిన్ ఆ విల్లాను స్వాధీన పరచుకుంటాడని అంటున్నారు. కాగా, ఇప్పటికే మూడు సార్లు వేలం ప్రకటన వేసినా సరైన స్పందన రాలేదు. తొలుత రూ.90 కోట్ల రిజర్వ్‌డ్ ప్రైస్ విధించడంతో ఆ విల్లాను కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

 చివరి సారిగా గత నెల ఆరో తేదీన వేలం ప్రకటన వేసినా.. తగిన స్పందన రాలేదు. దీంతో తాజాగా మరోసారి రేటు తగ్గించి విధించిన మార్జినల్ ప్రైస్‌కు కొంచెం ఎక్కువ చెల్లించి విల్లాను సొంతం చేసుకున్నాడట సచిన్. వికింగ్ మీడియాకు అధిపతి అయిన సచిన్ జోషి.. జేఎంజే గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌కు వైస్ చైర్మన్‌గా ఉన్నాడు. ఆ కంపెనీ తరఫున పలు వ్యాపారాలను సచిన్ నిర్వహిస్తున్నాడు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top