టాలీవుడ్‌లో స్టార్ హీరోలు యువరత్న నందమూరి బాలకృష్ణ, కింగ్ అక్కినేని నాగార్జున మధ్య గత రెండేళ్లుగా సరైన సంబంధాలు లేవు. వీరిద్దరు ఎప్పుడు ఒకే వేదిక మీదకు వస్తారా ? ఎప్పుడు కలుస్తారా ? అని టాలీవుడ్ సినీజనాలతో పాటు ఈ ఇద్దరు హీరోల అభిమానులు ఎంతో ఉత్కంఠతో వెయిట్ చేశారు. ఎట్టకేలకు టీఎస్సార్ అవార్డుల వేడుకలో మాత్రం ఈ ఇద్దరూ కలిశారు. చేతులు కలిపారు.
నాగ్ అయితే బాలయ్యతో తనకు విబేధాలు ఉన్నాయని వస్తోన్న వార్తల్లో నిజం లేదని..అవన్నీ పుకార్లే అని కొట్టిపడేశాడు.ఒకప్పుడు తమ తండ్రుల స్నేహం తాలూకు వారసత్వాన్ని కొనసాగిస్తూ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి సాగిన నాగ్-బాలయ్యల మధ్య ఎక్కడ తేడా కొట్టిందో ఏమో కానీ.. గత కొన్నేళ్లుగా ఇద్దరూ దూరం దూరంగా ఉంటున్నారు.
వీరిద్దరి విబేధాలు ఎక్కువ రోజులు కంటిన్యూ అయితే మంచిది కాదన్న ఉద్దేశంతో టీఎస్సార్‌తో పాటు మోహన్‌బాబు మరికొందరు సినీపెద్దలు వీరి మధ్య అపోహలు లేకుండా చేశారట. దీంతో నాగ్-బాలయ్య తమ విబేధాలు పక్కన పెట్టేసి కలిసిపోయారన్న చర్చలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. అది అసలు సంగతి.


