ఎయిర్ టెల్ తన యూజర్లకు గతంలో ఎన్నడూ ఇవ్వని సూపర్ కాలింగ్ ఆఫర్ ఇచ్చింది. కేవలం రూ.99తో రీఛార్జి చేసుకుంటే చాలు అన్ లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ కాల్స్ చేసుకునే ఆఫర్ ఇచ్చింది. అయితే గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏ నెట్ వర్క్ కైనా అన్ లిమిటెడ్ గా ఫ్రీ కాల్స్ చేసుకోవచ్చు. ఎయిర్ టెల్ యూజర్స్ ఏ టైం లోనైనా , ఏ నెట్వర్క్ కైనా ఫ్రీ కాలింగ్ చేసుకొనే సౌకర్యం కల్పిస్తుంది. మీ దగ్గర ఎయిర్టెల్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఉంటే మీరు ఈ ప్లాన్ ను పొందొచ్చు. దీనికంటే ముందు ఎయిర్ టెల్ 349 రూ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. దీనిలో యూజర్స్ కి 28 జీబీ ఇంటర్నెట్ డేటా ఆఫర్ లభిస్తుంది. మరోవైపు జియో ప్రకటించిన..
జియో ప్రకటించిన సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను నిలిపివేయాలని ట్రాయ్ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాల ప్రకారం ఈ ఆఫర్‌ను ఉపసంహరించుకున్నట్లు జియో కూడా అధికారికంగా ప్రకటించింది. అయితే ట్రాయ్ తీసుకున్న నిర్ణయాన్ని ఫోన్ రాడార్ బ్లాగ్ వ్యవస్థాపకుడు, టెకీ అమిత్ భద్వానీ తీవ్రంగా వ్యతిరేకించారు. ట్రాయ్ జియో ఆఫర్‌ను ఉపసంహరించుకోవాలని ఆదేశాలిచ్చిన రోజును ‘బ్లాక్ డే ఫర్ డిజిటల్ ఇండియా’గా ఆయన అభివర్ణించారు. ట్రాయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై పునరాలోచించాలని ఆయన సూచించారు. సామాన్యుడికి ఇంటర్నెట్ సేవలను దూరం చేసే విధంగా ఈ నిర్ణయం ఉందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, అధిక ధరలకు ఇంటర్నెట్ సేవలందిస్తూ, ఇతర కంపెనీలు సామాన్యుడిని దోచుకుంటున్నాయని ఆయన పిటిషన్‌లో వెల్లడించారు.


