యూట్యూబ్ సరికొత్త రూల్స్.. ఇకపై మనీ సంపాదన కష్టమే

ప్రపంచంలో మొత్తం ప్రజల అందరి మీద సోషల్ మీడియా ప్రభావం ఎక్కువైంది. ప్రొద్దున్న లేచిన దగ్గర నుండి పడుకునే దాకా ప్రజలు తమ ప్రక్కన ఉన్న వాళ్ళను పట్టించుకోవటలేదు గానీ తాము ఆ రోజు చేసిన విషయాలను మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇకపై సోషల్ మీడియాలో ఒకటైన యూట్యూబ్ వాడడం ఇప్పుడు కష్టం కాబోతోంది. అసలు విషయంలోకి వెళ్తే సోష‌ల్ మీడియా ప్ర‌భావం బాగా పెరిగిపోవ‌డంతో ఆన్‌లైన్ వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెల్స్ పుట్ట‌గొడుగుల్లా పుట్టుకు వ‌చ్చేశాయి. దీంతో ఎవ‌రికి వారు ఓ సైటో లేదా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని అడ్డదారిలో మ‌నీ సంపాద‌న‌కు అల‌వాటు ప‌డ్డారు. అయితే ఇకపై యూట్యూబ్‌ ఛానల్ ద్వారా మనీ సంపాదించడం కష్టం కాబోతోంది.

ఇప్పటికే సోషల్ మీడియాలో ఉన్న ఫేస్బుక్, ట్విట్టర్ మరియు ఇన్స్ట్రాగ్రామ్ నుండి గట్టిపోటి ఎదుర్కుంటోంది యూట్యూబ్. అందుకే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చే నకలీ ఛానల్స్ కు అడ్డుకట్ట వేయడానికి సరికొత్త రూల్స్ పెట్టింది. ఈ కొత్త రూల్స్ ప్రకారం యూట్యూబ్‌లో పోస్ట్‌ చేసిన వీడియోకి కనీసం 10 వేల వ్యూస్ వుండాలి. అంతవరకు ఆ వీడియోకు యాడ్ ఇవ్వదు. నెట్ యూజర్స్ క్లిక్‌లను బట్టే ఆ ఛానెల్‌కు డ‌బ్బులు ఇస్తారు. ఏదేమైనా ఈ కొత్త రూల్స్ దెబ్బ‌తో చాలా న‌కిలీ యూట్యూబ్ ఛానల్స్‌కు బ్రేకులు ప‌డ‌క త‌ప్పేలా లేదు. ఇక‌పై యూట్యూబ్‌లో అంత సులువుగా డ‌బ్బులు రావు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top