జియో విసిరిన సవాల్ ను తిప్పికొట్టేందుకు భారతీయ టెలికం దిగ్గజం ఎయిర్ టెల్ కిందా మీదా పడుతోంది. అందుకే మరో బంపర్ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. మై హోం పథకంలో భాగంగా ఇంతకు ముందు ఉన్న 5జీబీ డేటాను రెట్టింపు చేసింది. ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్‌తో కలిపి పోస్ట్‌పెయిడ్, డిటిహెచ్ సేవలపై నెలకు 10 జీబీ డాటాను ఉచితంగా అందించనున్నట్టు ఎయిర్ టెల్ తాజాగా వెల్లడించింది. ఈఆఫర్ ప్రకారం ఎయిర్‌టెల్ బ్రాడ్ బ్యాండ్‌తో పాటు ప్రతి పోస్ట్ పెయిడ్ కనెక్షన్, డిజిటల్‌టీవీ సేవల్లో దీన్ని ఆఫర్ చేస్తోంది. అయితే మై ఎయిర్‌టెల్ యాప్‌లో మై హోమ్ ద్వారా మాత్రమే ఈ ఆఫర్ లభ్యమవుతోందని కంపెనీ ప్రకటించింది.
జులై 1, 2016కి ముందు ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను ప్రారంభించిన వినియోగదారులకు మాత్రమే ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంది. దీంతో పాటే కొన్ని పరిమితులు కూడా విధించింది. ప్రస్తుత ఉచిత డేటాను రెట్టింపుచేయడంతోపాటు, బ్రాడ్‌బ్యాండ్, పోస్ట్‌పెయిడ్, డీటీహెచ్ సర్వీసుల పరిమితులను కూడా తొలగించింది.


