మజ్జిగలో ఓ స్పూన్ మెంతులను రాత్రంతా నానపెట్టాలి. ఉదయం పరకడుపునే నాన పెట్టిన మెంతులతో సహా మజ్జిగను కలిపి తాగేయాలి. ఇది కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. దీంతో ఎలాంటి పొట్టనైనా ఈ మిశ్రమం కరిగించేస్తుంది.
ఒక స్పూన్ మెంతులను రాత్రంతా నీటిలో నానపెట్టాలి. వేడినీటితో ఉదయంవేళ ఖాళీ కడుపుతో తినాలి. ఇవి మీలోని వ్యర్ధ పదార్ధాలను విసర్జించటమే కాదు బరువును గణనీయంగా తగ్గిస్తాయి. జీర్ణశక్తిని పెంచుతాయి. లేదా వేడి నీటితో కలిపి వాటిని నమిలివేయవచ్చు.
మెంతి పొడి – మెంతులను పెనంపై వేడి చేసి అవి బాగా వేగిన తర్వాత పౌడర్ గా చేసుకొని చల్లబడినతర్వాత తినవచ్చు. గాలి చొరని డబ్బాలో ఈ మెంతి పొడి వుంచాలి. పెరుగు తో కలిపి తినవచ్చు.
మెంతి పొడిని గ్రీన్ లేదా బ్లాక్ టీలో కలిపి తాగవచ్చు. ఖాళీ కడుపుతో ఉదయం వేళ తాగితే, అది ఆకలిని నియంత్రిస్తుంది.
ఆరోగ్యకరమైన జీవన విధానంలో భాగంగా మెంతులను బరువు తగ్గించేందుకు వాడవచ్చు. ఇది ఎంతో తేలికగా ఆచరించకల విధానం
మెంతులు బరువు ఎలా తగ్గిస్తాయి?
1. మెంతులులో పీచు అధికం. రక్తపోటు నియంత్రిస్తాయి. బ్లడ్ షుగర్ నియంత్రిస్తాయి. చాలా సేపు ఆకలిలేకుండా కూడా చేస్తాయి.
2. మెంతులలో కార్బోహైడ్రేట్లు తక్కువ. ఫలితంగా మీకు అధిక బరువు చేరదు.
3. బరువు తగ్గాలంటే మీరు కేలరీలు తగ్గించాలి. మెంతులు చాలా తక్కువ కేలరీలు కలిగి వుంటాయి.