గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలు - జాగ్రత్తలు

Common health problems in pregnancy In Telugu


Common health problems in pregnancy In Telugu : గర్భధారణ అనేది ప్రతి స్త్రీ జీవితంలో అపు రూపమైన సమయం. గర్భధారణ దగ్గర నుంచి శిశువు జన్మించే వరకు ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటే చాలా హాయిగా ఉంటుంది. గర్భధారణ సమయంలో శరీరంలో అనేక మార్పులు కలుగుతాయి. సాధారణంగా గర్భధారణ సమయంలో వచ్చే మార్పుల గురించి మరియు జాగ్రత్తల గురించి వివరంగాతెలుసుకుందాం.

వికారంగర్భం ధరించిన మహిళల్లో ఉదయం వికారంగా ఉండి వాంతి వచ్చేలా అన్పిస్తుంది. ఒక్కోసారి వాంతి అయ్యేవరకు చిరాకుగానే ఉంటుంది. ఈ సమస్య సాధారణంగా మొదటి త్రైమాసికంలో ఉంటుంది. అయితే కొంతమందిలో రెండొవ త్రైమాసికంలో కూడా ఉంటుంది.

అజీర్ణం
భోజనం ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా ఎక్కువసార్లు తీసుకోవాలి. అలాగే భోజనం చేసే సమయంలో ద్రవాలను ఎక్కువగా తీసుకోకూడదు.

అలసట
అలసట తొందరగా వచ్చేస్తుంది.అలసటగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కడ కూర్చున్న కాళ్ళు పైకి పెట్టి కూర్చోవాలి.

తరచూ మూత్ర విసర్జన
బేబీ బంప్ పెరిగే కొద్దీ బ్లాడర్ మీద ఒత్తిడి పెరిగి తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది. వెంటనే మూత్ర విసర్జన చేయాలి. స్టార్ ఉంచుకోకూడదు.

తిమ్మిర్లు
గర్భధారణ సమయంలో తేలికపాటి వ్యాయామాలు సెహస్తు ఉంటే తిమ్మిర్లు తగ్గుతాయి. అయితే వ్యాయామం చేసేటప్పుడు ఒక్కసారి డాక్టర్ ని సంప్రదించాలి.

మలబద్దకం
మలబద్దకం అనేది గర్భిణీ స్త్రీలలో సాధారణమైన సమస్య. ఆహారంలో ఎక్కువగా ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. నీటిని ఎక్కువగా త్రాగుతూ ఉండాలి.
Share on Google Plus