నమస్కారం పెడితే కాండ్రించి ఉమ్మిన బాలకృష్ణ .. ఎక్కడ ఎప్పుడు ఎవరిపై అంటే..


నమస్కారం పెడితే కాండ్రించి ఉమ్మిన బాలకృష్ణ .. ఎక్కడ ఎప్పుడు ఎవరిపై అంటే.. 

తనకు ఇష్టం లేకపోయినా,  సినిమా అవకాశాలు లేక తప్పనిసరిగా  మండలాధీశుడు సినిమా లో NTR గెటప్ లో విలన్ గా నటించాడు కోట. చేసిన తప్పు కు క్షమించమని చెన్నై airport లో NTR కు ఎదురుపడి నమస్కరించి వేడుకుంటే.., పెద్దాయన బాగా నటించావని, మంచి భవిష్యత్తు ఉందని భుజం తట్టి క్షమించినా, అభిమానులు మాత్రం వదలలేదు. ఒకసారి విజయవాడ రైల్వే స్టేషన్ లో   NTR కోసం వచ్చిన అభిమానులు అపుడే ట్రైన్ దిగిన కోట ను చూసి తన్ని వదిలిపెట్టారు. 

ఇక మరో సందర్భం లో కోట శ్రీనివాసరావు ఏదో సినిమా షూటింగ్ నిమిత్తం రాజమండ్రి లో ఉన్నపుడు, బాలకృష్ణ కూడా వేరే సినిమా షూటింగ్ కోసం రాజమండ్రి వస్తే ఇద్దరూ ఒకే చోట బస చేసారు. లిఫ్ట్ వద్ద బాలకృష్ణ ఎదురుపడితే కోట నమస్కారం చేసాడు. కానీ బాలకృష్ణ, కోట ముఖం మీద కాండ్రించి ఉమ్మేసాడు. 

ఒక సూపర్ స్టార్, ముఖ్యమంత్రి కొడుకు తన తండ్రి ని తిడితే, ఎలా రియాక్ట్ అవుతాడో అలానే రియాక్ట్ అయాడని కోట చెప్పాడు.

Share on Google Plus