వృదాప్య లక్షణాలు కనపడకుండా ఉండాలంటే అయిల్స్

Anti ageing essential oils In Telugu

Anti ageing essential oils In Telugu :వృద్దాప్యం వచ్చిందంటే ముందుగా చర్మంలో ఆ మార్పు స్పష్టంగా కనపడుతుంది. అయితే చిన్నవయసులో ఈ మార్పు కనపడితే ఆ సమస్యను యాంటీ ఏజింగ్ సమస్య అనిపిలుస్తారు. ఈ సమస్యను కొన్ని ఆయిల్స్ చర్మంపై మసాజ్ చేయటం ద్వారా తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చెప్పబోయే ఆయిల్స్ లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన వృద్దాప్య లక్షణాలను తరిమి కొడతాయి. అయితే ఈ నూనెలు ఎలా సహాయపడతాయో వివరంగా తెలుసుకుందాం.

జోజోబ ఎన్షెషియల్ ఆయిల్
జోజోబ ఎన్షెషియల్ ఆయిల్ లో వృద్దాప్య లక్షణాలను తరిమి కొట్టే లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ నూనె ముడతలు, చారలను తగ్గించటమే కాకుండా చర్మంలో ఎలాసిటిని పెంచి చర్మం వదులు కాకుండా టైట్ గా ఉంచుతుంది. జోజోబ ఎన్షెషియల్ ఆయిల్ లో కొంచెం కొబ్బరినూనె కలిపి చర్మానికి రాసి 5 నిమిషాల పాటు మసాజ్ చేసి పావుగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

హలిచ్రిసమ్ ఎసెన్షియల్ ఆయిల్
హెలిచ్రిసమ్ ఎసెన్షియల్ ఆయిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. అందువల్ల వృద్ధాప్య లక్షణాలు రాకుండా ఫ్రీరాడికల్స్ మీద పోరాటం చేస్తాయి. అందుకే దీన్ని యాంటీ ఏజింగ్ క్రీమ్ లలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. సింపుల్ గా దీన్ని ఆలివ్ ఆయిల్ తో కలిపి ఫేషియల్ మాస్క్ వేసుకోవడం ద్వారా యవ్వనంగా చర్మంతో కనబడుతారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top