ఒక కిడ్నీ ఉన్నవారు తీసుకోవలసిన జాగ్రత్తలు తప్పనిసరి

one kidney precautions In Telugu

one kidney precautions In Telugu :సాధారణంగా ప్రతి మనిషి రెండు కిడ్నీలతో జన్మిస్తాడు. అయితే కొన్ని కారణాల వలన ఒక కిడ్నీతో మనుగడ సాగించవలసి వస్తుంది. ఒక కిడ్నీ ఉన్నా సరే జీవితాన్ని హ్యాపీగా గడపవచ్చు. ఒక కిడ్నీ ఉన్నవారు తరచుగా డాక్టర్దగ్గరకు వెళ్లి తనిఖీ చేయించుకుంటూ ఉండాలి. దానికి తగ్గట్టుగా జీవనశైలిలో మార్పులు చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఒక కిడ్నీ ఉన్నవారు మూడు విషయాల పట్ల జాగ్రత్తలు వహించాలి.

రక్తపోటును తరచుగా తనిఖీ చేయించుకోవాలి. రక్తపోటు అధికం అయితే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రక్తపోటు తనిఖీ చేయించుకొని దానికి అనుగుణంగా మందులు వాడాలి. కొన్ని మందులు కిడ్నీల మీద ప్రభావము చూపుతాయి. అందువల్ల మీ పరీక్ష ఫైల్ ని డాక్టర్ కి చూపిస్తే దానికి అనుగుణంగా కిడ్నీ మీద ప్రభావం చూపని మందులు రాస్తారు.

రక్తం నుండి ప్రోటీన్ మూత్రం ద్వారా బయటకు పోతుంది. ఇలా ప్రోటీన్ బయటకు వెళ్ళిపోవటం వలన శరీరం మరింత సోడియం మరియు ద్రవాలను నిలబెట్టుకోవటంలో సమతుల్యతను కోల్పోతుంది. తద్వారా పొత్తికడుపు లేదా చీలమండలలో వాపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితి ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి.

జి.ఎఫ్.ఆర్ అనగా గ్లోమెర్యులర్ ఫిల్టరేషన్ రేట్. దీనిని తప్పనిసరిగా తనిఖీ చేయించుకోవాలి. కిడ్నీల పనితీరు, రక్త నాళాల  నుండి ఎంతమేర మూత్రపిండాలు వ్యర్ధ పదార్ధాలను తొలగించగలుగుతుందో తెలుస్తుంది. దీనిని బట్టే  వైద్యులు కిడ్నీల పనితీరును అంచనా వేస్తారు.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top