Cardamom :యలకులతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయో తెలుసా?




Cardamom:చక్కని రుచి,సువాసన కలిగిన యలకులను ముఖ్యంగా స్వీట్స్ లో వేసుకుంటూఉంటాం. యలకులను మసాలా దినుసుగా వాడతాం. అంతేకాక టీలో కూడా చాలా మంది వేసుకుంటారు. కేవలం యాలకులు రుచికే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. కొన్ని అనారోగ్య సమస్యలను పరిష్కరించటంలో చాలా బాగా సహాయపడతాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

యాలకుల లోపలి గింజలను తీసి మెత్తని పొడిగా చేసి ఒక మెత్తని క్లాత్ లో వేసి మూట కట్టి వాసన పీల్చుతూ ఉంటే తలనొప్పి తగ్గిపోతుంది.

మనం ప్రతి రోజు త్రాగే టీలో యాలకులు వేసుకుంటే మూత్రాశయ సమస్యలు తొలగిపోతాయి.

యాలకుల లోపలి గింజలను తీసి మెత్తని పొడిగా చేసి దానిలో కొంచెం నిమ్మరసం కలిపి తీసుకుంటే వాంతులు తగ్గుతాయి.

యలకులను నోటిలో వేసుకొని చప్పరిస్తే నోటి దుర్వాసన తొలగిపోతుంది. యాలకుల లోపలి గింజలను తీసి మెత్తని పొడిగా చేసి మీగడలో కలిపి తీసుకుంటే నోటి పూత తగ్గిపోతుంది.

యాలకులు, దోసకాయ గింజలు కలిపి చూర్ణం చేసి తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి.

ప్రతి రోజు ఉదయం పరగడుపున ఒక అరటి పండులో ఒక యాలక్కాయను ఉంచి దాన్ని అలాగే తినేయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా 21 రోజుల పాటు తింటూ ఉంటే అర్ష మొలలు తగ్గుతాయి.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top