Health Tips:ఈ పండ్లను తొక్కతో సహా తింటే...ఎన్నో ప్రయోజనాలు...మీకు తెలుసా?

FRuits Peels Health Benefits In Telugu

FRuits Peels Health Benefits In Telugu :అన్ని రకాల పండ్లలోనూ విటమిన్స్, మినిరల్స్ ,యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల పండ్లను తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే మనం తిని పడేసే తొక్కలలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ ప్రయోజనాల గురించి తెలుసుకుంటే పండ్ల తొక్కలను పడేయకుండా తింటారు. ఇప్పుడు ఏ పండు తొక్క తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుస్కుందాం.

ఆరెంజ్ తొక్క
ఆరెంజ్ పండులో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్స్ ఆరెంజ్ తొక్కలో కూడా ఉంటాయి. ఇవి శరీరంలో అనవసర కొవ్వును కరిగించటంలో సహాయపడుతుంది. అంతేకాక మలబద్దకం, శ్వాస సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

దానిమ్మ తొక్క
దానిమ్మతొక్కలో న్యూట్రీషియన్స్, విటమిన్స్ సమృద్ధిగా ఉండుట వలన అనేక రకాల వ్యాధులను తగ్గించటంలో చాలా బాగా సహాయపడుతుంది. ఎముకలను బలంగా ఉంచటమే కాకుండా గొంతు సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.

పుచ్చకాయ తొక్క
సాధారణంగా పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కొత్త కణాలను ప్రోత్సహించటం వలన జుట్టు,చర్మానికి బాగా సహాయపడుతుంది. బరువు తగ్గాలని అనుకొనే వారు పుచ్చకాయ తొక్కను తింటే చాల మార్పు కనపడుతుంది.

ఆపిల్
ఆపిల్ తొక్కలో ఫైబర్ సమృద్ధిగా ఉండుట వలన మలబద్దకం సమస్యను తరిమి కొడుతోంది. అంతేకాక వ్యాధి నిరోధక శక్తిని పెంచటంలో కూడా బాగా సహాయపడుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top