ఈ పువ్వులతో ఫేషియల్ చేస్తే ముఖం మెరుస్తుంది

Flower Face Packs for Glowing Skin In Telugu
Flower Face Packs for Glowing Skin In Telugu : సాధారణంగా ఫెషియల్ చేయించుకుంటే చర్మం మృదువుగా మరియు రిలాక్స్ గా ఉంటుంది. ఫెషియల్ లో ముఖ కండరాలకు మసాజ్ చేయటం వలన మలినాలు తొలగిపోతాయి.

అంతేకాక రక్త ప్రసరణ పెరిగి చర్మం మృదువుగా మారుతుంది. ఫెషియల్ చర్మాన్ని చైతన్యపరచి లోపల నుండి మృదుత్వాన్ని,ప్రకాశాన్ని కలిగిస్తాయి. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముడతలు రాకుండా చేస్తాయి. 

ఫెషియల్ కి ఉపయోగించే ఉత్పత్తులు అన్ని చర్మ అన్ని పొరల్లోకి చొచ్చుకొని పోతాయి. దాంతో చర్మం తేమగా ఉంటుంది. ఫెషియల్స్ లో చాలా రకాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మనం పువ్వులతో ఫెషియల్స్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

రోజ్ ఫెషియల్
గులాబీలను అనేక సౌందర్య ఉత్పత్తులలో ఉపయోగిస్తున్నారు. చర్మాన్ని మృదువుగా చేయటమే కాకుండా ఎరుపు దనాన్ని తగ్గిస్తుంది. చర్మ రంద్రాల పరిమాణాన్ని తగ్గిస్తుంది. అంతేకాక చర్మ బ్రేక్ అవుట్స్ ని కూడా సమర్ధవంతంగా తగ్గిస్తుంది. చర్మ రంద్రాలు ఎక్కువగా ఉన్నవారు ఈ రోజ్ ఫెషియల్ ని ఉపయోగించుకోవచ్చు.

లావెండర్ ఫెషియల్
లావెండర్ క్రిమినాశక మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉండుట వలన చర్మంలో అధికంగా ఉన్న నూనెను తగ్గిస్తుంది. మొటిమల సమస్యకు కారకాలను కూడా తరిమి కొడుతోంది. దాంతో మొటిమల సమస్య కూడా తగ్గుతుంది. ఈ ఫెషియల్ ని రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటే ముఖ ఛాయ కూడా మెరుగుపడుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top