Mosquitoes : సీజన్ మారింది. వానలు ప్రారంభం అయ్యాయి. దోమలు కూడా స్వైర విహారం చేస్తూఉంటాయి. దోమ కుట్టిందంటే దాని ప్రభావం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాములు దోమ అయితే పర్వాలేదు.
కానీ దోమలు కుడితే జ్వరాలు మరియు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆలా దోమలు మన పరిసరాల్లో లేకుండా ఉండాలంటే కొన్ని మొక్కలను పెంచుకోవాలి. ఇప్పుడు ఆ మొక్కల గురించి తెలుసు కుందాం.
రోజ్‌మేరీ
ఈ మొక్కను ఇంట్లో వేసుకుంటే రెండు రకాలుగా ఉపయోగం ఉంటుంది. ఈ మొక్క దోమలను తరిమేస్తుంది. అంతే కాకుండా ఈ మొక్క ఆకులను కొత్తిమీర, కరివేపాకులా వంటల్లో వేసుకుంటే వంటలకు చక్కని రుచి వస్తుంది.
అగిరేటమ్
ఈ మొక్క గడ్డి మొక్కలా పెరుగుతుంది. ఈ మొక్కకు తెలుపు లేదా ఊదా రంగు పూలు పూస్తాయి. ఈ మొక్కను తెలుగు వారు పోక బంతి అని పిలుస్తారు. ఈ మొక్కలను పెంచుకుంటే ఇంటిలోకి దోమలు రావు.
లెమన్‌బామ్
లెమన్‌బామ్ మొక్కల నుండి విడుదలయ్యే వాసన దోమల్ని తరిమేస్తుంది. ఈ మొక్క చాలా తొందరగా పెరుగుతుంది. ఈ మొక్కకు నీరు కూడా చాలా తక్కువ అవసరం అవుతుంది. ఈ మొక్కలను తోటలో, ప్రహరీ గోడలపై, ఇంట్లో కిటికీల వద్ద కూడా పెంచుకోవచ్చు.
పుదీనా
పుదీనా కూడా దాని ఘాటైన వాసనతో దోమలను తరిమేస్తుంది. పుదీనా మొక్కను కుండీలో పెంచుకోవచ్చు. దోమలు ఉన్న ప్రదేశంలో కొన్ని పుదీనా ఆకులను ఉంచిన దోమలు పారిపోతాయి.