వేసవిలో మామిడి పళ్ళు తినాలని ఎంతో ఇష్టంతో తెచ్చుకుంటూ ఉంటాము. ఎంత తిన్నా , దగ్గరికి వచ్చేసరికి ఒక రెండు మూడు పళ్ళు waste అవుతూ ఉంటాయి. జ్యూస్ కానీ ఏదైనా చేసుకుంటూ ఉంటాము .అలాగే నిల్వ ఉండడానికి కూడా ఇలా తాండ్ర చేసుకుంటే పిల్లలు ఇష్టంగా బాక్స్ లోకి అదే స్నాక్స్ లోకి అలా పెట్టుకుని తింటూ ఉంటారు.
కావలసినవి:
మగ్గిన మామిడి పండ్లు ,పంచదార లేక బెల్లం.
చేసే విధానం పంచదారతో:
రెండు బంగినపల్లి మామిడి ముక్కలు లేదా రసం మామిడి పండ్లు తీసుకోవచ్చు. జూసర్ జార్ తీసుకొని ఈ ముక్కలు వేసి బాగా బ్లెండ్ చేయాలి. ఒక పాన్ తీసుకొని , మిక్సీ చేసిన మామిడిపండు గుజ్జు, అరకప్పు పంచదారని వేసుకోవాలి. ఇక్కడ మామిడిపండ్ల గుజ్జు రెండు కప్పులు ఉంటే ఒక్క అర కప్పు పంచదార తీసుకోండి.
మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా దగ్గరయ్యే వరకు కలుపుతూ ఉండాలి. దగ్గరపడిన మామిడి మిశ్రమాన్ని ఈ గ్రీస్ చేసి ఉంచుకున్న పళ్ళెంలోకి వేసుకోండి. ఇది ఇప్పుడు ఎండలో పెట్టుకోవచ్చు లేదా ఫ్యాన్ గాలికి కూడా ఆర పెట్టుకోవచ్చు. పైన మనం పల్చటి క్లాత్ ఒకటి కప్పి ఉంచుకుంటే దుమ్ము పడకుండా ఉంటుంది.
చేసే విధానం బెల్లం తో:
బంగిన పల్లి ముక్కలు మిక్సీ చేసి ఒక పాన్ తీసుకొని దాంట్లో మామిడిపండు గుజ్జుని వేసి తురిమిన బెల్లం కూడా వేసుకోండి. ఒక మూడు కప్పుల ప్యూరీకి ఒక కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. ఫ్లేమ్ లో టు మీడియం చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగంటకుండా చుట్టూ అంచులు కూడా కలిసేలా కలుపుకుంటూ ఉండాలి .
మామిడి పళ్ళు చిన్న రసం అయితే పీచు ఉంటుంది, కాబట్టి బంగినపల్లి అయితే బాగుంటుంది ఇందులో ఒక్క టేబుల్ స్పూన్ నిమ్మరసం, లైట్ గా ఇలాచీ వేసుకోవచ్చు మీ ఇష్టం. మంచి texture కోసం కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ కి నెయ్యితో గ్రీస్ చేసుకొని అందులో మామిడి మిశ్రమాన్ని వేసుకోండి రెండు మూడు రోజులు ఎండనివ్వండి.