పంటి నొప్పి తగ్గటానికి ఇంటి చిట్కాలు

ఒక గ్లాస్ వేడి నీటిలో ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ నీటిని నోటిలో పోసుకొని బాగా పుక్కిలించాలి. ఈ విధంగా ఒక గ్లాస్ నీరు అయ్యేంత వరకు చేయాలి. దీని వలన నొప్పితో పాటు, వాపు నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.

కొన్ని మిరియాలను మెత్తగా పొడి చేసుకొని, దీనికి కొన్ని చుక్కల నీటిని కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ని నొప్పి ఉన్న పంటి ప్రాంతంలో ఉంచాలి.

కొన్ని లవంగాలను పేస్ట్ చేసి దానికి కొంచెం ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమం పంటి నొప్పిని తగ్గిస్తుంది. అలాగే మార్కెట్ లో దొరికే లవంగం నూనెను కొద్దిగా కాటన్ తో ముంచి నొప్పి ఉన్న ప్రాంతంలో పెట్టుకున్న మంచి పలితం కనపడుతుంది.

నీటితో తడిపిన దూదిని బేకింగ్ సోడాలో ముంచి నొప్పి ఉన్న ప్రాంతంలో పెట్టుకోవాలి. కొంతసేపు నోరు మూసుకొని ఉంటే, నొప్పి నుండి ఉపశమనం కలుగుతుంది.

నొప్పిని తట్టుకోలేక కొంతమంది నోటిని గట్టిగా నొక్కుతారు. కానీ అలా చేయుట వలన సమస్య పెరుగుతుంది.
block1/Bhakti

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top