Face Glow Tips in telugu:ఈ రోజుల్లో ముఖం అందంగా, తెల్లగా మెరిసిపోవాలని కోరుకుంటున్నారు. దాని కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉంటున్నారు. బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు.
అలా కాకుండా మనకు ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ముఖం మీద నల్లని మచ్చలు, మొటిమలు ఐలా అన్ని రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు.
చింతపండులో నీటిని పోసి రెండు గంటలు నానబెట్టి రసం తీయాలి. ఈ రసం దాదాపుగా రెండు స్పూన్లు తీసుకోవాలి. ఈ రసంలో అర స్పూన్ పంచదార, అర స్పూన్ తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి.
పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే ముఖం మీద పేరుకుపోయిన మురికి, దుమ్ము ,ధూళి అన్ని తొలగి పోతాయి.
అలాగే నల్లని మచ్చలు, మొటిమలు కూడా తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది. చింతపండు చర్మ సంరక్షణలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ చిట్కా ఫాలో అయ్యి చాలా తక్కువ ఖర్చుతో అందమైన ముఖాన్ని సొంతం చేసుకోండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.