Uttareni Health Benefits in telugu :మన ఇంటి చుట్టుపక్కల ఎన్నో రకాల మొక్కలు ఉంటాయి. అయితే వాటిలో ఉన్న ప్రయోజనాలు గురించి తెలియక వాటిని ఏవో పిచ్చి మొక్కలుగా భావిస్తాము. అయితే వాటిలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉంటాయి.
అలాంటి మొక్కలలో ఉత్తరేణి మొక్క ఒకటి. ఈ మొక్క ఎక్కువగా చేలల్లో, పొలాల గట్ల మీద, ఖాళీ ప్రదేశాలలో పెరుగుతుంది. ఈ మొక్కను ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు . ఉత్తరేణి గింజలను 20 గ్రాముల మోతాదులో తీసుకుని నీటిని పోసి మిక్సీ చేసి ఆ నీటిని వడగట్టాలి.
ఈ నీటిని ప్రతి రోజు ఉదయం పరగడుపున తాగుతూ ఉంటే కిడ్నీలో రాళ్లు కరుగుతాయి. అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. ఉత్తరేణి మొత్తం మొక్కను కాల్చి బూడిద చేయాలి. ఈ బూడిదకు రెండు రెట్లు పంచదార కలిపి నిలువ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ప్రతి రోజు మూడు గ్రాముల మోతాదులో తీసుకుంటే దగ్గు, ఆయాసం, కఫం వంటి సమస్యలు తొలగిపోతాయి. పిప్పి పన్ను సమస్యను తగ్గించడంలో ఉత్తరేణి మొక్క అద్భుతంగా పనిచేస్తుంది.
ఉత్తరేణి మొక్క గింజలను దంచి జల్లించి మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. 100 గ్రాముల పొడికి 10 గ్రాముల ఉప్పు కలిపి నిలువ చేసుకోవాలి. ఈ పొడితో ప్రతిరోజు దంతాలను శుభ్రం చేసుకుంటే దంత సమస్యలు అన్ని తొలగిపోతాయి. పిప్పి పన్ను సమస్య తగ్గడమే కాకుండా గార పట్టిన, పసుపు పచ్చ రంగులో మారిన దంతాలు తెల్లగా మారుతాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.