Black Cardamom Tea : ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి, ఒత్తిడి వంటి అనేక రకాల కారణాలతో నరాలకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారిలో నరాల బలహీనత, నరాల నొప్పులు, నరాల వాపులు, నరాలలో అడ్డంకులు ఏర్పడటం వంటి ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి.
అలాగే కాలేయం, కిడ్నీల సమస్యలతో బాధపడే వారికి కూడా నరాల బలహీనత సమస్య వస్తుంది. పోషకాహార లోపం ఉన్నవారిలో కూడా నరాల సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ సమస్యలను తగ్గించడానికి నల్ల యాలకులు చాలా బాగా సహాయపడతాయి.
మనకు ఆకుపచ్చ రంగులో ఉన్న యాలకులు మాత్రమే తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో నల్ల యాలకులు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. ఇప్పుడు ఈ టీ ఎలా తయారు చేయాలో చూద్దాం.
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోయాలి దానిలో పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి, రెండు లవంగాలు, ఒక నల్ల యాలక్కాయ వేసి ఐదు నుంచి ఐదు నిమిషాల పాటు మరిగించి ఆ నీటిని వడగట్టి ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగాలి.
ఈ విధంగా ప్రతిరోజు పరగడుపున తాగుతూ ఉంటే నరాల బలహీనత సమస్య తగ్గుతుంది. నరాలలో ఉండే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. నరాల సమస్యలు తగ్గడమే కాకుండా కాలేయం,కిడ్నీలకు ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.