Face Glow Tips In telugu:మనలో చాలామంది ముఖం అందంగా కాంతివంతంగా ఉండాలని కోరుకుంటారు. అలా కోరుకోవడం కూడా సహజమే. ముఖం మీద మచ్చలు, మొటిమలు ఏమీ లేకుండా తెల్లగా, కాంతివంతంగా మెరవాలంటే ఇంటి చిట్కాలు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి.
బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్దీ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చులో ముఖాన్ని కాంతివంతంగా మెరిసేలా చేసుకోవచ్చు.
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోయాలి. నీరు కాస్త వేడి అయ్యాక రెండు స్పూన్ల అవిసె గింజలు, నాలుగు నిమ్మ ముక్కలు వేసి పది నిమిషాల పాటు ఉడికించాలి. ఆ తర్వాత పొయ్యి ఆఫ్ చేసి ఉడికిన మిశ్రమం నుండి జెల్ ను సపరేట్ చేయాలి.
ఈ జెల్ లో చిటికెడు కుంకుమపువ్వు, రెండు చుక్కల విటమిన్ ఈ ఆయిల్ వేసి అన్ని ఇంగ్రిడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ క్రీమ్ ని ఒక బాక్స్ లో నింపి ఫ్రిజ్లో స్టోర్ చేస్తే దాదాపుగా నెల రోజులపాటు నిల్వ ఉంటుంది.
ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి ముందు ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఈ క్రీమ్ ని రాసి సున్నితంగా మసాజ్ చేసి పడుకోవాలి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడగాలి.
ఈ విధంగా ప్రతిరోజు చేస్తూ ఉంటే స్కిన్ టోన్ క్రమంగా మెరుగు పడటమే కాకుండా చర్మం కాంతివంతంగా మారుతుంది. ముడతలు, డార్క్ సర్కిల్స్ వంటివి కూడా ఏమీ ఉండవు. కాబట్టి ఈ క్రీమ్ తయారు చేసుకుని వాడటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.